newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మందుబాబులకు గుడ్ న్యూస్.. అమ్మకాలకు ‘గ్రీన్’ సిగ్నల్

02-05-202002-05-2020 10:31:02 IST
Updated On 02-05-2020 12:11:05 ISTUpdated On 02-05-20202020-05-02T05:01:02.643Z02-05-2020 2020-05-02T05:00:42.791Z - 2020-05-02T06:41:05.678Z - 02-05-2020

మందుబాబులకు గుడ్ న్యూస్.. అమ్మకాలకు ‘గ్రీన్’ సిగ్నల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నోరు పెడారిపోతోంది.. పిచ్చిపిచ్చిగా వుంది. సార్ జర.. వైన్ షాపులు తెరవండి.. అని అడిగితే తెలంగాణ సీఎం ఏమన్నారో మనందరికీ ఎరుకే. మందుచుక్క దొరక్కపోతే చచ్చిపోతార్రా.. మీ బతుకు చెడ అంటూ తిట్టిపోశారు. కానీ దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ గడువును కేంద్రం మరో రెండు వారాలపాటు పొడిగించింది. దీంతో మే 17 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. రెడ్ జోన్లలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు కానుండగా.. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా మందుబాబులకు కేంద్రం భారీ ఊరట ఇచ్చింది. గ్రీన్ జోన్ల పరిధిలోని పాన్ షాపులు, లిక్కర్ షాపులు అమ్మకాలు చేపట్టవచ్చని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

దీంతో మందుబాబులు ఖుషీ అవుతున్నారు. మందు దొరక్క దొరికినవి తాగి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రికి మందు దొరకని వారు అనారోగ్యం పాలై, విచిత్రంగా ప్రవర్తిస్తూ చికిత్స కోసం తరలి వెళ్లారు. తాజాగా వైన్ షాపులు తెరిచేందుకు అనుమతులు రావడంతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేవు. అయితే మద్యం అమ్మకాలకు కేంద్రం నిబంధనలను విధించింది.

షాపుల దగ్గర ఐదుగురి కంటే ఎక్కువగా ఉండొకూడదు. ఒక్కొక్కరి మధ్య రెండు గజాల దూరం కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.కేంద్రం ఆదేశాలతో మే 4 నుంచి గ్రీన్ జోన్లలో లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. కానీ రాష్ట్రాలు కూడా దీనికి అంగీకారం తెలపాలి. తెలంగాణలో మద్యం షాపులు ఎప్పుడు తెరుస్తారా అని మందుబాబులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరి కేసీయార్ ఏం చేస్తారో చూడాలి. తిడతారో. లేక మందేసి చిందేయయంటారో చూడాలి. 

దేశంలో కరోనా కేసులు ప్రారంభం అయ్యాక లాక్ డౌన్ అమలుచేయడం మొదలుపెట్టారు. దీంతో మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా మద్యంషాపులకు తాళాలు పడ్డాయి. వాటి అమ్మకాలు నిలిచిపోయాయి. కేరళ లాంటి రాష్ట్రాలు పరిమితంగా మద్యాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా.. న్యాయస్థానాలు, కేంద్రం అందుకు ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం అమ్మకాలు చేపట్టొద్దని రాష్ట్రాలకు సూచించింది. మద్యం దొరక్కపోవడంతో బ్లాకులో డబుల్, ట్రిపుల్ రేట్లకు కొని తమ దాహం తీర్చుకుంటున్నారు. గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు షురూ అయితే మాత్రం మద్యం షాపులు, స్టఫ్ అమ్మే దుకాణాలు కళకళలాడడం గ్యారంటీ. కానీ మద్యం కోసం అర్రులు చాస్తున్న జనం నిబంధనలు పాటిస్తారా? చూడాలి. 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   an hour ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   an hour ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   5 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   7 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   2 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   9 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   9 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   2 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   3 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   10 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle