మందుబాబులకు కేసీఆర్ కరోనా పరిమితుల సడలింపు!
17-03-202017-03-2020 11:52:13 IST
2020-03-17T06:22:13.799Z17-03-2020 2020-03-17T06:22:10.372Z - - 17-04-2021

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి రాష్ట్రంలోని మందు బాబులపై తన ప్రేమను చాటుకున్నారు. రాష్ట్రమంతా జనసమూహాలు ఏర్పడే ప్రాంతాలపై పరిమితులు విధించిన సర్కార్ ఒక్క మందుబాబుల విషయంలో మాత్రం పరిమితులను సడలించింది. రాష్ట్రమంతా ఈనెల 31 వరకు షట్ డౌన్ ఆదేశాలిచ్చిన రాష్ట్రంలో బార్లు, రెస్టారెంట్లు, పర్మిట్ రూంలు, క్లబ్బులకు మాత్రం ఈనెల 21 వరకే షట్ డౌన్ విధిస్తూ జీవో ఇచ్చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా (కోవిడ్-19) మన తెలుగు రాష్ట్రాలను కూడా హడలెత్తిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు అనుమానితుల సంఖ్యా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి నిత్యం ప్రపంచ దేశాల నుండి వందలలో వచ్చే ప్రయాణికులతో పాటు వైరస్ కూడా అడుగుపెడుతుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈక్రమంలోనే కేసీఆర్ సర్కార్ ఆదివారం నుండి రాష్ట్రవ్యాప్తంగా కఠిన పరిమితులను విధించింది. విద్యాసంస్థల నుండి పార్కులు, ఫంక్షన్ హాళ్ల వరకు అన్నిటినీ షట్ డౌన్ చేయాల్సిందేనని ఆదేశించింది. దీని ప్రభావం హైదరాబాద్ మహానగరంలో స్పష్టంగా కనిపించింది. ఆదివారం సెలవైనా ప్రజలు బయటకు వచ్చేందుకు ఇష్టపడలేదు. ఇక సోమవారం కూడా అత్యవసర విధులున్న వాళ్ళే రోడ్ల మీదకి వచ్చారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న పరిమితులపై రోజుకి కోట్లలో రాష్ట్రానికి నష్టం వస్తుంది. చిరు వ్యాపారులు, రోజువారీ వ్యాపారాలు చేసుకొనేవాళ్ళు, ఆటో డ్రైవర్ల నుండి సినిమా థియేటర్లను నమ్ముకొని పొట్టపోసుకొనేవాళ్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రజల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవిధంగా వైరస్ ప్రభావితం కాకముందే ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం హర్షించదగినదే. అయితే, విద్యాసంస్థలను కూడా సెలవులు ప్రకటించడంతో లక్షల మంది విద్యార్థుల చదువులకు బ్రేకులు పడ్డాయి. ఇక వివాహాది శుభకార్యాలను కూడా ఆగిపోతున్నాయి. కానీ ఒక్క బార్లు, క్లబ్బులకు మాత్రం సీఎం కేసీఆర్ స్పెషల్ సడలింపులను ఇవ్వడంతో రాష్ట్రంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్నిటికీ ఈనెల చివరి వరకు షట్ డౌన్ విధించిన ప్రభుత్వం బార్లు, క్లబ్బులపై వారం మాత్రమే విధించడంపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వీధి వ్యాపారాల దగ్గర నుండి పెద్ద పెద్ద మాల్స్ వరకు వ్యాపారాలు తగ్గి నష్టం వేలకోట్లలో ఉంటున్నా సీఎం మాత్రం మందు మీద వచ్చే ఆదాయానికి గండి పడకుండా చూసుకుంటున్నారా? అంటూ కొందరు విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. కరోనా కట్టడికి వేలకోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్ధమన్న ప్రభుత్వం మద్యం మీద వచ్చే ఆదాయం వదులుకోలేక పోవడం ఏమిటని పలువురు విమర్శలు చేస్తున్నారు. నిజానికి మద్యంపై ఆదాయం చిన్న విషయమేమీ కాదు. ఒక్కమాటగా చెప్పాలంటే మద్యం లేకపోతే తెలుగు రాష్ట్రాలలో సంక్షేమం అటకెక్కినట్లే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మద్యం మీద ఆదాయమే వివిధ పథకాల పేర్లతో ప్రభుత్వాలు తిరిగి ఆ ప్రజలకు చెల్లించేది. తాజాగా తెలంగాణలో మద్యం ధరలను పెంచిన ఆదాయంతోనే సీఎం కేసీఆర్ రైతు బంధు చెల్లింపులు చేస్తున్నారు. ఈక్రమంలో ఆ ఆదాయమే వారు ముఖ్యమనుకున్నారేమో!

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
an hour ago

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి
an hour ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
2 hours ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
2 hours ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
5 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
3 hours ago

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. సరే Prends ఉంటా
4 minutes ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
6 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
20 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
16-04-2021
ఇంకా