newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మందుబాబులకు ఆబ్కారీ శాఖ శుభవార్త

04-08-202004-08-2020 09:33:13 IST
Updated On 04-08-2020 14:44:27 ISTUpdated On 04-08-20202020-08-04T04:03:13.749Z04-08-2020 2020-08-04T04:01:10.574Z - 2020-08-04T09:14:27.849Z - 04-08-2020

మందుబాబులకు ఆబ్కారీ శాఖ శుభవార్త
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మందుబాబులు పండుగ చేసుకునే వార్త ఇది. లాక్ డౌన్ నిబంధనలతో మందుకోసం ఎక్కువసేపు పడిగాపులు పడాల్సిన అవసరం లేదు. మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. లాక్‌డౌన్‌ నేపధ్యంలో మద్యం దుకాణాలపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని.. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలను తెరుచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ఆబ్కారీ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులను జారీ చేశారు.

గతంలో లాక్ డౌన్ సమయంలో మందుషాపులు తెరవాలంటూ మద్యం ప్రియులు ప్రభుత్వానికి వినతులు చేశారు. చివరికి సీఎం కేసీయార్ మందుబాబుల కోసం నిబంధనలతో మద్యం షాపులు తెరిచారు. అయితే లాక్ డౌన్ నిబంధనల ప్రకారం మాస్క్, భౌతిక దూరంతో మే 6 నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి.

మే నెలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఇచ్చారు. అక్కడక్కడా నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలు నమోదయ్యాయి. ఆ తర్వాత జూన్ 1 నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులు తెరుచుకోవచ్చునని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

జూలై 2న ఆబ్కారీ శాఖ మరోసారి ఉత్తర్వులను జారీ చేసి రాష్ట్రంలో రాత్రి 9:30 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతిచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఆ ఆంక్షలను పూర్తిగా తొలగించింది. దీని ప్రకారం రోజుకి 12 గంటల పాటు మద్యం షాపులు తెరుచుకునే అవకాశం ఇచ్చింది.

ప్రభుత్వ నిర్ణయంతో రాత్రిపూట కూడా కర్ఫ్యూ ఎత్తివేయడంతో మందుబాబులు రాత్రి 10 గంటలవరకూ మందు కొనుక్కునే అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై మహిళా సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. మందుతాగి అర్థరాత్రి ఇళ్ళకు వచ్చి గొడవలు చేస్తారని మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   36 minutes ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   17 minutes ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   5 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   6 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   2 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   9 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   9 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   an hour ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   3 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   9 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle