మంథనిలో పుట్టా మధు Vs శ్రీధర్ బాబు
02-06-202002-06-2020 09:46:52 IST
Updated On 02-06-2020 10:20:18 ISTUpdated On 02-06-20202020-06-02T04:16:52.796Z02-06-2020 2020-06-02T04:16:44.726Z - 2020-06-02T04:50:18.320Z - 02-06-2020

తెలంగాణలో వివిధ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతుంటాయి. రెండురోజుల క్రితమే మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరస్పర విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకదశలో నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో వీరి మాటల దాడి సాగింది. అది మరిచిపోకముందే తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని నియోజక వర్గంలో రాజకీయవేడి మొదలైంది. కాంగ్రెస్ నేత, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జడ్పి ఛైర్మెన్ పుట్ట మధుకర్ ల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం మంథని పోలిస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకున్న రంగయ్య కుటుంబాన్ని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరామర్శించారు. దీంతోనే రాజకీయ వివాదం మొదలైంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పాత్రికేయ సమావేశం నిర్వహించిన జడ్పి ఛైర్మెన్ పుట్ట మధుకర్ .. శ్రీధర్ బాబు కుటుంబం పై ఘాటైన విమర్శలు చేశారు. బీసీ నాయకులను అణగదొక్కేయడమే శ్రీధర్ బాబు నైజం అని మండిపడ్డారు. శ్రీధర్ బాబు తండ్రి స్పీకర్ శ్రీపాదరావు గురించి వ్యక్తిగత విమర్శలకు దిగారు పుట్టా మధు. శ్రీపాదరావు ఏంటో మంథని ప్రజలకు తెలుసని మావోయిస్టులు శ్రీపాద రావుని ఎక్కడ ఏచోట ఏ శరీర బాగంలో కాల్చి చంపారో శ్రీధర్ బాబు చెప్పాలంటూ విమర్శలు చేశారు. మంథని నియోజకవర్గంలో శ్రీపాదరావు ఎంత మంది మహిళలను చిత్ర హింసలకు గురిచేశాడో మంథని ప్రజలు గుర్తుపెట్టుకున్నారని మధు అన్నారు. తనను విమర్శించే హక్కు శ్రీధర్ బాబుకి లేదన్నారు. పుట్టా మధు మరోనేతపైన తీవ్ర విమర్శలకు దిగారు. పెద్దపల్లి మాజి ఎమ్మెల్యే విజయరమణారావుపై ఆయన మండిపడ్డారు. పలు హత్యకేసుల్లో నిందితుడైన విజయరమణారావు హత్య కేసులో జైలుకెళ్ళొచ్చావ్ నాగురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ దుయ్యబట్టారు. రాజీవ్ రహదారి రోడ్లలో శ్రీధర్ బాబు వద్ద ఎన్ని ముడుపులు తీసుకున్నావో తెలియదా? అన్నారు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఇంటి ముందు దీక్ష చేస్తానని మధు హెచ్చరించారు. ఈ విమర్శలు ఇంకా ఏ స్థాయికి చేరతాయోనని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఏపీలో స్కూల్స్ బంద్
13 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
13 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
17 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
19 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
14 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
21 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
21 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
14 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
15 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
a day ago
ఇంకా