newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మంత్రులనూ వదలని కరోనా..

19-09-202019-09-2020 14:49:15 IST
2020-09-19T09:19:15.478Z19-09-2020 2020-09-19T09:19:12.950Z - - 12-04-2021

మంత్రులనూ వదలని కరోనా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కోవిడ్-19 వైరస్ అటు మంత్రులనూ వదలలేదు. వారి సిబ్బందినీ వదలలేదు. కొన్ని నెలల క్రితం కరోనా వైరస్ సోకిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ ఆఫీసులో మొత్తం ఏడుమందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలటంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈటల రాజేందర్ పేషీలో ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్‌మెన్లు ఉన్నట్లు మంత్రి మీడియాకు తెలిపారు. 

ఈ నేపథ్యంలో తనకూ గురువారమే కరోనా నిర్ధారణ పరీక్ష చేశారని, ఆ పరీక్షలో నెగెటివ్‌ వచ్చిందన్నారు మంత్రి. రెండ్రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకుంటానని ఆయన తెలిపారు. 

కాగా ఏడుగురికి ఒకేసారి కరోనా పాజిటివ్‌ రావడంతో మంత్రి కార్యాలయంలో కలకలం రేగింది. దీంతో బీఆర్కే భవన్‌లోని మంత్రి ఈటల కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేశారు. ఈటల సహా బీఆర్కే భవన్‌లోని మంత్రి పేషీ మిగతా సిబ్బంది అంతా పరీక్షలు చేయించుకున్నారు. అందరి ఫలితం నెగెటివ్‌ వచ్చింది. 

ఈటల శుక్రవారం బీఆర్కే భవన్‌కు రాలేదని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇంట్లోనే ఉండి ఉదయం, సాయంత్రం సందర్శకులను కలిశారని తెలిసింది.అయితే తనకు నెగెటివ్‌ వచ్చి నందున శనివారం బీఆర్కే భవన్‌లోని తన కార్యాలయానికి యథావిధిగా వస్తానని  ఈటల తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా 2,043 కేసులు నమోదయ్యాయి. వైర్‌సతో 11 మంది మృతి చెందారు. మొత్తం బాధితుల సంఖ్య 1,67046కు, మరణాల సంఖ్య 1016కు చేరింది. గురువారం 50,634 మందికి పరీక్షలు చేశారు. 1,039 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉంది. మరో 1,802 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 1,35,357కు చేరింది. 

కొత్త కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 314, కరీంనగర్‌లో 114, ఖమ్మంలో 84, మేడ్చల్‌లో 144, రంగారెడ్డి 174, సిద్దిపేటలో 121, వరంగల్‌ అర్బన్‌ లో 108, నల్లగొండలో 131, నిజామాబాద్‌లో 65 నమోదయ్యాయి.

హైదరాబాద్‌ మాదాపూర్‌ ఎస్సై అబ్బాస్‌ అలీ కరోనా బారినపడి చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయారు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు పంపడంలో ఈయన కీలకంగా వ్యవహరించారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle