newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మంత్రి హరీష్‌కు కరోనా.. ఆందోళనలో టీఆర్ఎస్ శ్రేణులు!

05-09-202005-09-2020 12:53:59 IST
2020-09-05T07:23:59.900Z05-09-2020 2020-09-05T07:23:57.327Z - - 11-04-2021

మంత్రి హరీష్‌కు కరోనా.. ఆందోళనలో టీఆర్ఎస్ శ్రేణులు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. కొద్దిపాటి సింప్టమ్స్ ఉండటంతో టెస్ట్ చేయించుకోగా.. అందులో కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ కంగారు పడొద్దని కార్యకర్తలకు, అభిమానులకు సూచించారు. తనతో కాంటాక్ట్ అయిన వారందరూ టెస్టు చేయించుకోవాలని హరీశ్ రావ్ కోరారు. ఒకవేళ పాజిటివ్ వచ్చినా మైల్డ్ సింప్టమ్స్ ఉంటే హోం ఐసోలేషన్‌లో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు.

కాగా, ఇప్పటికే అధికార పార్టీలో పలువురు ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకగా ఇప్పుడు మంత్రి హరీష్ రావుకు కూడా సోకింది. ఇక హరీష్ ఫ్యామిలీ, అయన సిబ్బందికి కూడా టెస్టులు నిర్వహించాల్సి ఉండగా మరోవైపు ఆయనకు పాజిటివ్ ఫలితాలతో టీఆర్ఎస్ శ్రేణులు కలవర పడుతున్నాయి. తెలంగాణలో ఆ మధ్య తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించినా మళ్ళీ ఇప్పుడు మరోసారి ఉదృతంగా మారిందా అనిపించేలా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది.

ఆగష్టు రెండో వారం వరకు హైదరాబాద్ నగరంలో కేసుల సంఖ్య అధికంగా నమోదవగా ఇప్పుడు జిల్లాలలో పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో మరింత ఉదృతంగా వ్యాప్తి ఉన్నట్లుగా కేసులు సంఖ్య కనిపిస్తుంది. తాజాగా గత 24 గంటల్లో రాష్ట్రంలో 2511 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా నేటి కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్షా 38 వేల 395కు చేరుకుంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle