newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు... నెక్స్ట్ సీఎం కేటీఆర్!

27-12-201927-12-2019 13:28:33 IST
Updated On 28-12-2019 11:51:56 ISTUpdated On 28-12-20192019-12-27T07:58:33.519Z27-12-2019 2019-12-27T07:58:05.223Z - 2019-12-28T06:21:56.172Z - 28-12-2019

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు... నెక్స్ట్ సీఎం కేటీఆర్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీఎం పోస్టుపై కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. భవిష్యత్తులో కేటీయార్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశం కేసీయార్ వైపు, తెలంగాణ కేటీయార్ వైపు చూస్తోందన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న టీఆర్ఎస్ భేటీలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 

 కేసీయార్ తర్వాత ప్రజాదరణ ఉన్న నేత కేటీయారే అన్నారు మంత్రి. ప్రజల గురించి విజన్ ఉన్న నేత కేటీయార్ అన్నారు. కేసీయార్ తర్వాత కేటీయార్ సీఎం కావడం సహజం అన్నారు. కేసీయార్ తర్వాత కేటీఆర్ సీఎం అయితేనే రాష్ట్రం మరింతగా బాగుపడుతుందన్నారు శ్రీనివాస్ గౌడ్.

టీఆర్ఎస్ లో ఇలాంటి చర్చ ఉంది కాబట్టే శ్రీనివాస్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. త్వరలో తెలంగాణలో నాయకత్వ మార్పు తథ్యమనే భావన టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన అన్ని అర్హతలూ కేటీఆర్‌కు ఉన్నాయని, తెలంగాణ ఉద్యమంలోనూ కేటీఆర్‌ క్రియాశీలకంగా పాల్గొన్నారని పేర్కొన్నారు.

కేటీఆర్‌ను సీఎంను చేసి.. కేసీఆర్‌ కేంద్ర రాజకీయాల్లోకి వెళతారని ఊహాగానాలు వస్తున్న వేళ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2018 ముందస్తు ఎన్నికల తర్వాత కేటీయార్‌కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. ఈ పరిణామాలు జరిగి ఏడాది అవుతోంది. మునిసిపల్ ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు జరుగుతాయని అంటున్నారు. ఏది ఏమైనా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయాలను వేడెక్కించారని చెప్పవచ్చు. 

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   23 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   34 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle