newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మంత్రి వర్గ విస్తరణకు సిద్దమవుతున్న సీఎం కేసీఆర్?

19-03-202019-03-2020 11:37:53 IST
2020-03-19T06:07:53.907Z19-03-2020 2020-03-19T06:07:51.602Z - - 16-04-2021

మంత్రి వర్గ విస్తరణకు సిద్దమవుతున్న సీఎం కేసీఆర్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాజకీయాలలో మరో కీలక అంశం త్వరలోనే జరగనుందని రాజకీయ వర్గాలలో ప్రచారం మొదలైంది. మున్సిపల్ ఎన్నికలకు ముందే మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని భావించిన సీఎం కేసీఆర్ కొన్ని అనివార్యకారణాల వలన అప్పుడు బ్రేకులేశారు. అయితే, ఇప్పుడు ఆ పనికి సరైన ముహూర్తం పెట్టేసుకున్నట్లుగా తెలుస్తుంది.

ప్రస్తుతమున్న వారిలో కొందరిని సాగనంపి.. మరికొందరికి ఆహ్వానం పలికే ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లుగా తెలుస్తుంది. ఇందుకోసం ముందుగా తన ప్రభుత్వ ఇంటెలిజెన్స్ నివేదికతో పాటు బయట సంస్థల నుండి కూడా తన మంత్రి వర్గంపై నివేదికలు తెప్పించుకున్న కేసీఆర్ త్వరలోనే మంత్రివర్గ పక్షాన మొదలుపెట్టనున్నట్లుగా చెప్తున్నారు.

అయితే, ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరికి ఉద్వాసన పలకనున్నారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో సహజంగానే చర్చ మొదలైంది. ప్రస్తుతమున్న వారిలో మొత్తం నలుగురు మంత్రులను సాగనంపే అవకాశముందంటున్నారు. వీరిలో మంత్రి చామకూర మల్లారెడ్డి ముందు వరసలో ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలలో బలంగా వినిపిస్తుంది. సీఎం కేసీఆర్ తెప్పించుకున్న నివేదికల ఆధారంగా మల్లారెడ్డి చివరి స్థానంలో ఉన్నట్లుగా చెప్తున్నారు.

నిజానికి రాష్ట్రంలో కొన్ని వర్గాల ప్రజలకు మల్లారెడ్డి మంత్రిగా కూడా పరిచేయమే లేదన్న వాదన నివేదికలో వెల్లడైనట్లుగా చెప్తున్నారు. అయన వద్ద ఉన్న అధికారుల తప్పిదమైనా అయన దూకుడు లేకపోవడం కలిసి అయన పదవికి ఎసరు తెచ్చినట్లుగా చెప్తున్నారు. మల్లారెడ్డితో పాటు మరో సీనియర్ మంత్రికి కూడా ఈ పదవి గండం ముంచుకొచ్చినట్లుగా తెలుస్తుంది.

సీనియర్ నేతగా.. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను కూడా మంత్రి పదవి నుండి తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలలో గట్టిగా వినిపిస్తుంది. ఈటల మంత్రివర్గం నుండి తప్పించడంపై ఇప్పటికే గతంలో రెండుసార్లు ప్రచారం కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఆయా సందర్భాలలో ఈటల కూడా పబ్లిక్ గానే తన అసంతృప్తిని కూడా బటయపెట్టేశారు.

ఈటల వ్యవహారంపై అప్పటి నుండే అసంతృప్తిగా ఉన్న సీఎం కేసీఆర్ కు నివేదికలలో కూడా ఈటలకి మంచి మార్కులు రాకపోవడం కలిసి వచ్చిందంటున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ప్రభావంతో మంత్రి ఈటల తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్యశాఖను అప్రమత్తం చేయడంతో పాటు కోవిడ్-19 విషయంలో బ్యాలెన్స్ గా ముందుకెళ్తున్నారు.

మరి ఈ విషయంలో సీఎం కేసీఆర్ సంతృత్తి చెందితే ఆయనకు పదవి గండం తప్పే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాగా ఉద్వాసన లిస్టులో ఈ ఇద్దరితో పాటు మరో నలుగురు మంత్రులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే, హరీష్ రావు, తలసాని, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ పదవులకు మాత్రం ఎలాంటి ఢోకా లేదంటున్నారు.

ఇక, మంత్రివర్గంలో కొత్తగా ఎవరిని తీసుకోవాలనే దానిపై కూడా ఇప్పటికే పార్టీ అధిష్టానం వద్ద చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయట. ఇందులో సీఎంగా కేసీఆర్ మార్క్ ప్రక్షాళన ఉంటుందా? లేక కాబోయే సీఎంగా ప్రచారం జరుగుతున్న కేటీఆర్ మార్క్ విస్తరణ ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. ఓ ఇద్దరికి అయితే కేటీఆర్ కేటగిరీ మంత్రులకే అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయని బలంగా వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది త్వరలోనే తేలిపోనుంది.

 

 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle