newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మంత్రి మల్లారెడ్డి అవినీతి పరుడు.. మాజీ హోంమంత్రి నాయిని కామెంట్స్

07-03-202007-03-2020 16:05:05 IST
Updated On 07-03-2020 16:13:33 ISTUpdated On 07-03-20202020-03-07T10:35:05.358Z07-03-2020 2020-03-07T10:35:03.369Z - 2020-03-07T10:43:33.548Z - 07-03-2020

మంత్రి మల్లారెడ్డి అవినీతి పరుడు.. మాజీ హోంమంత్రి నాయిని కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా మల్లారెడ్డిపై నాయిని మండిపడ్డారు. ‘‘కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు. కార్మికుల పొట్టగొట్టిండు. పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తాడు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో కోట్లు సంపాదించాడు’’ అని మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగం తర్వాత ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మల్లారెడ్డిపై వచ్చిన విమర్శలను గుర్తు చేసుకోవాలని, అప్పుడు టికెట్లు అమ్మి రూ.కోట్లు దండుకున్నారని నాయిని ఆరోపించారు.

‘‘నాచారంలోని లిక్కర్ ఇండియా కంపెనీ దగ్గర మంత్రి డబ్బులు తీసుకొని 9 మంది కార్మికుల పొట్టగొట్టాడు’’ అని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల టైంలో మల్లారెడ్డి పై వచ్చిన విమర్శలను కూడా నాయిని గుర్తు చేశారు. "టికెట్లు అమ్మి మంత్రి కోట్లు సంపాదించిండు. అసెంబ్లీ ఎలక్షన్లలో పెట్టిన ఖర్చును మున్సిపల్ ఎన్నికల్లో కలెక్ట్‌‌‌‌‌‌‌‌ చేసిండు’’అని అన్నారు. ఈ విషయాన్ని కేటీఆర్‌‌కూ ఫిర్యాదు చేశానని నాయిని చెప్పారు.

మరోవైపు త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలపై నాయిని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తనను రాజ్యసభ పంపుతానని హామీ ఇచ్చారు. రాజ్యసభ సీటు తనకే వస్తుందని నాయిని ధీమా వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సీఎంను చాంబర్‌లో కలిశాక మీడియాతో మాట్లాడారు నాయిని. సీఎంకి గుర్తుచేశా.. ఫికర్ పడొద్దన్నారని నాయిని అన్నారు. ఆర్టీసీ చైర్మన్ పదవి తన హోదాకు సరిపోదన్నారు. నేను త్వరలో ఢిల్లీకి పోతానని, ఏదో ఓ పదవిస్తమని, అప్పటి వరకు మంత్రి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ ఖాళీ చేయొద్దని సీఎం తనకు చెప్పారని నాయిని వివరించారు. ఓ మంత్రిపై అధికార పార్టీ నేత, మాజీ హోంమంత్రి నాయిని చేసిన ఆరోపణలు స్వంత పార్టీలోనే కలకలం రేపుతున్నాయి. 

ముందస్తు ఎన్నికల సమయంలోనూ నాయిని నర్సింహారెడ్డి అధిష్టానంపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. తన అల్లుడికి టికెట్ ఇవ్వలేదని అలిగారు నాయిని.  కార్మికులకు ఏం కష్టం వచ్చినా వారి వెంటే వుండేవారు నాయిని. గతంలో ఎన్నోసార్లు కార్మికుల పక్షాన నిలబడ్డారు. తాజాగా మంత్రిపై చేసిన కామెంట్లతో టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle