newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

మంత్రి పువ్వాడ ఇంటి ముట్టడికి ప్రయత్నం... జగ్గారెడ్డి అరెస్ట్

15-10-201915-10-2019 16:39:46 IST
Updated On 15-10-2019 18:13:50 ISTUpdated On 15-10-20192019-10-15T11:09:46.113Z15-10-2019 2019-10-15T11:08:49.725Z - 2019-10-15T12:43:50.817Z - 15-10-2019

మంత్రి పువ్వాడ ఇంటి ముట్టడికి ప్రయత్నం... జగ్గారెడ్డి అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ తనవంతు మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటిని ముట్టడించేందుకు బయలు దేరిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సమ్మె విరమింప చేసేందుకు కేసీఆర్ ను మంత్రి పువ్వాడ ఒప్పించాలని జగ్గారెడ్డి  కోరారు.

అయితే అందుకు సంబంధించి ఎలాంటి చర్యలు కనిపించక పోవడంతో మంత్రి ఇల్లు ముట్టడికి బయలు దేరిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టును నేతలు ఖండించారు. దీంతో సంగారెడ్డి ఆర్టీసీ డిపో వద్దకు కార్మికులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో చేరుకుని నిరసనకు దిగారు. 

ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.  అక్కడ ఉద్రిక్తత నెలకొని ఉంది. ప్రజల అవసరాలకు ఆర్టీసీ ఎంతో అవసరమని, ఆర్టీసీని బతికించుకోవాలని జగ్గారెడ్డి గత కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు.

ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని... అతని కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను నేడు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి రావడం దారుణమని ఈమధ్యే ఆయన కామెంట్ చేశారు. వేలాదిమంది ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రిని ఒప్పించకుంటే రవాణాశాఖ మంత్రి చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని జగ్గారెడ్డి అన్నారు.

కేసీఆర్‌ ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం ఎక్కడుందని, ఎవరిని మిగిల్చారని ఆయన ప్రశ్నించారు. సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతునిస్తుందని, అవసరమైతే కోర్టుకు వెళతామని కార్మికులకు భరోసా ఇచ్చారు. మరో కాంగ్రెస్ నేత ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు.

సమ్మెపై తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడడం వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. కార్మికులకు మద్దతుగా పోరాటాన్ని ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

ఈనేపథ్యంలోనే కార్మికులతో కలిసి ఈనెల 21న ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల కాలికి ముల్లు గుచ్చుకున్నా పంటితో తీస్తానన్న కేసీఆర్, ప్రస్తుతం ఎందుకు అణిచివేత ధోరణికి పాల్పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. సమ్మె విషయంలో ప్రభుత్వం నియతృత్వ ధోరణిని అవలంభిస్తుందని మరోనేత దామోదర రాజనర్సింహ విమర్శించారు. మొత్తం మీద కాంగ్రెస్ నేతలు ఆర్టీసీ కార్మికులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle