newssting
BITING NEWS :
* సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సుదీర్ఘ చర్చలు. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల రాత్రి 9 గంటల వరకు ఆరవ విడత చర్చలు. * మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు, మహిళలు అధికం. * బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకు సమాజ్‌వాదీ పార్టీ మద్ధతు. సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా సోమవారం రాత్రి ప్రకటన. * ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు. ముంబై, థానే, రాయగడ్, పూణే, సతార, సిందూర్గ్ ప్రాంతాల్లో మంగళవారం ఉరుముులు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై వాతావరణ శాఖ హెచ్చరికలు. రష్యా దేశంలో భారీ భూకంపం. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యన్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడి. భూకపంపంతో ప్రజలు భయాందోళనలు. విగత జీవిగా దొరికిన సరూర్ నగర్ తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్‌. * కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య సాగుతున్న విమర్శ, ప్రతి విమర్శలు. * కేంద్ర బిల్లులతో రైతులకు మేలని బీజేపీ వర్గాలు, కొత్తగా తెచ్చిన బిల్లులతో రైతులను తీవ్ర నష్టమని టీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు. 280వ రోజుకు చేరుకున్న రాజధాని అమరావతి రైతుల ఉద్యమం. కొనసాగుతున్న శిబిరాల్లో రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ జరిగే అవకాశం. బుధవారం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నా మంగళవారం ఆకస్మిక ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలతో చర్చకు అవకాశం. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం.

మంత్రి పువ్వాడకు గవర్నర్ ఫోన్... సమ్మెపై ఆరా

17-10-201917-10-2019 18:36:01 IST
2019-10-17T13:06:01.033Z17-10-2019 2019-10-17T13:05:58.612Z - - 22-09-2020

మంత్రి పువ్వాడకు గవర్నర్ ఫోన్... సమ్మెపై ఆరా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ రాజకీయ పరిణామాలను కేంద్రానికి నివేదించి వచ్చారు. కేంద్రం ఆదేశాలతో గవర్నర్ ఈ అంశంపై సీరియస్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. 

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆమె మంత్రి పువ్వాడతో చర్చించారు.  కార్మికుల డిమాండ్లను వివరించడానికి గవర్నర్‌ వద్దకు రవాణాశాఖ కార్యదర్శిని మంత్రి పంపించారు. త్వరలోనే మంత్రి అజయ్‌ గవర్నర్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సమ్మె ప్రభావం, విద్యాసంస్థలకు దసరా సెలవుల పొడిగింపు తదితర అంశాలపై గవర్నర్‌ ఆరా తీశారని అంటున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 13వ రోజు కూడా కొనసాగుతోంది. మరో రెండురోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ఉండడంతో ఆర్టీసీ సమ్మె ప్రభావం కనిపించలేదు. మంత్రి పువ్వాడ ముందే ప్రకటించినట్టు ఆర్టీసీ బస్సుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇవాళ ప్రయాణికులకు టికెట్లు జారీచేశారు. 

ఇదిలా ఉంటే..ఆర్టీసీ సమ్మెకు వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. నిరసనల్లో భాగంగా వివిధ పార్టీల నేతలు హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ డా.నాగేశ్వర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ‘ఆర్టీసీని నడపడం మీకు చేతకాకుంటే నాకివ్వండి. వేల కోట్ల లాభాల్లో నడిపిస్తాను’ అని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ప్రభుత్వానికి సవాల్‌ చేశారు.

ప్రభుత్వం తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. గురువారం ఇందిరాపార్క్‌ వద్ద వామపక్షాలు చేపట్టిన సామూహిక దీక్షను ఆయన ప్రారంభించి సమ్మెకు తన మద్దతును తెలిపారు. ఇటు ఓయూ విద్యార్ధులు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఆర్టీసీ కార్మికులకు తమ సంఘీభావం ప్రకటించారు. 

 

రూ.90 లక్షలిస్తే కోటిరూపాయలిస్తామంటూ బంపర్ ఆఫర్..

రూ.90 లక్షలిస్తే కోటిరూపాయలిస్తామంటూ బంపర్ ఆఫర్..

   10 minutes ago


ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు ఆయనే..!

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు ఆయనే..!

   19 minutes ago


ఆంధ్రప్రదేశ్ లో అణు విద్యుత్ కేంద్రం

ఆంధ్రప్రదేశ్ లో అణు విద్యుత్ కేంద్రం

   40 minutes ago


నిందలూ, ఆరోపణలతో మహా సర్కార్ పబ్బం..!

నిందలూ, ఆరోపణలతో మహా సర్కార్ పబ్బం..!

   7 hours ago


 మీ సేవలు ప్రజలకు అందకపోతే మీ చదువుతో ఏం లాభం.. వైద్యులకు ఈటెల ప్రశ్న

మీ సేవలు ప్రజలకు అందకపోతే మీ చదువుతో ఏం లాభం.. వైద్యులకు ఈటెల ప్రశ్న

   8 hours ago


ఒక్క యాప్‌తో 87 రకాల పోలీస్ సేవలు.. ఏపీ కొత్త రికార్డు

ఒక్క యాప్‌తో 87 రకాల పోలీస్ సేవలు.. ఏపీ కొత్త రికార్డు

   9 hours ago


చిన్నారి సుమేధ మృతిపై మేయర్ బొంతు రామ్మోహన్ అనుమానం..

చిన్నారి సుమేధ మృతిపై మేయర్ బొంతు రామ్మోహన్ అనుమానం..

   21 hours ago


బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

   21 hours ago


ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

   a day ago


స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle