newssting
BITING NEWS :
* చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌*ఏపీ శాసనమండలి కీలక నిర్ఱయం.. మూడురాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి.. టీడీపీ సంబరాలు * కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో * జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌ భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు*అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం *వివాదాస్పద స్వామీజీ నిత్యానందకు బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసిన ఇంటర్ పోల్ *ఏపీ: నేడు శాసనసభ కార్యక్రమాలను బహిష్కరించిన టీడీపీ.. అసెంబ్లీకి హాజరుకాకూడదని నిర్ణయం*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం*దావోస్: పెట్టుబడుల ఒప్పందాలపై నేడు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన*చైనాలో పంజా విసురుతోన్న 'కరోనా' వైరస్... ఇప్పటి వరకు 17 మంది మృతి*జోగులాంబ: ఎర్రవల్ల దగ్గర రోడ్డు ప్రమాదం... ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

మంత్రి పదవికి బదులు మండలి ఛైర్మన్ గిరి

11-09-201911-09-2019 12:28:46 IST
2019-09-11T06:58:46.849Z11-09-2019 2019-09-11T06:58:43.725Z - - 23-01-2020

మంత్రి పదవికి బదులు మండలి ఛైర్మన్ గిరి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానం వ్యూహాత్మకంగా ఉంటుంది. మంత్రిమండలి కూర్పు తర్వాత ఆయన బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టారు. గతంలో ఇతర పార్టీ లనుంచి వచ్చిన వారికి వివిధ పదవులు ఇచ్చారు. ముఖ్యంగా ఉమ్మ డి నల్లగొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి పదవి గ్యారంటీ అన్న ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయనకు శాసనమండలి చైర్మన్‌ పదవి ఇచ్చారు. శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛైర్మన్ గా ఎన్నికైనట్టు ప్రకటించారు. 

అనంతరం గుత్తా సుఖేందర్‌ రెడ్డిని చైర్మన్‌ చైర్‌ వద్దకు మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు విపక్ష సభ్యులు తీసుకెళ్లారు. అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మూడుసార్లు ఎంపీగా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొన్న సీఎం కేసీఆర్.. గుత్తాను మండలి చైర్మన్‌గా ఎంపికచేశారు.

మంత్రి పదవిపై ఆయన ఆశలు పెంచుకున్నా..  చివరకు మండలి బాధ్యతలు ఆయన చేతిలో పెట్టారు. తెలంగాణలో శాసనమండలికి రెండవ ఛైర్మన్ గా గుత్తా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్‌ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది మార్చి 29న ముగిసింది. దీంతో అప్పట్నుంచి తాత్కాలిక చైర్మన్‌గా డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ఉన్నారు.

మరోవైపు మంత్రి పదవి రాని నేతలు రగిలిపోతున్నారు. తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ టీఆర్ఎస్‌లో అసమ్మతి జ్వాలలు రేపుతోంది. ఒకవైపు సీనియర్ నేతలు బుజ్జగిస్తున్నా తమకు పదవి రాలేదనే బాధతో అసంతృప్తి జ్వాలలు రేగుతూనే ఉన్నాయి. ఈ విస్తరణలో మంత్రి పదవి తప్పక వరిస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలకు మొండి చెయ్యి చూపడంతో తమలో తాము రగిలిపోతున్నారు.

తాజాగా విప్ పదవి పొందిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అసమ్మతి జ్వాల రగిల్చారు. మంగళవారం స్వయంగా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి తనకు విప్ పదవి వద్దని చెప్పి అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోమవారమే తన గన్‌మెన్లను గాంధీ సరెండర్ చేశారు. సామాజిక వర్గంలో ప్రముఖుడిగా ఉన్న తనకు కాకుండా జూనియర్‌కు మంత్రి పదవి ఇచ్చారని ఆయన అలకబూనారు.

నిత్యానందకు చుక్కలు కనిపించనున్నాయా?

నిత్యానందకు చుక్కలు కనిపించనున్నాయా?

   2 hours ago


దేవుళ్ళకీ పౌరసత్వం కావాలి.. చిలుకూరు అర్చకుల డిమాండ్!

దేవుళ్ళకీ పౌరసత్వం కావాలి.. చిలుకూరు అర్చకుల డిమాండ్!

   3 hours ago


లోకేష్ ట్వీట్... ఇది బాబు మార్కు ‘సెలెక్ట్’ అంటూ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు1

లోకేష్ ట్వీట్... ఇది బాబు మార్కు ‘సెలెక్ట్’ అంటూ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు1

   3 hours ago


మండలిలో ట్విస్ట్.. మూడునెలలు మూడురాజధానులకు బ్రేక్

మండలిలో ట్విస్ట్.. మూడునెలలు మూడురాజధానులకు బ్రేక్

   3 hours ago


గులాబీ లీడ‌ర్స్‌తో ఓవైసీ బ్ర‌ద‌ర్స్‌ గొడ‌వేంటి..?

గులాబీ లీడ‌ర్స్‌తో ఓవైసీ బ్ర‌ద‌ర్స్‌ గొడ‌వేంటి..?

   4 hours ago


నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

   19 hours ago


రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

   19 hours ago


తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

   20 hours ago


సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

   21 hours ago


ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle