newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మంత్రి ఈటెల ఈసారి మాటల సంచలనం!

02-01-202002-01-2020 15:52:23 IST
2020-01-02T10:22:23.396Z02-01-2020 2020-01-02T10:22:20.254Z - - 17-04-2021

మంత్రి ఈటెల ఈసారి మాటల సంచలనం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ మంత్రులలో ఈటెల ప్రత్యేకం. ఎవరు అవునన్నా.. కాదన్నా తెరాస పార్టీలో రెండు వర్గాలు ఉంటాయి. ఒకటి తొలి నుండి తెలంగాణ కోసం పోట్లాడి.. కొట్లాడి.. ఉద్యమం సమయంలో పార్టీకి అండగా నిలిచి ఇప్పుడు పదవులు దక్కించుకున్న కేటగిరీ కాగా పార్టీ అధికారంలోకి వచ్చాక పక్క పార్టీల నుండి మందీ మార్బలంతో తెరాసలో చేరి పదవులు దక్కించుకొని చక్రం తిప్పుతున్నది రెండో వర్గం.

సీఎం కెసిఆర్ ఈ రెండు వర్గాలను తన తెలివితో డీల్ చేస్తూ పార్టీని నిలబెడుతూ వస్తున్నారు. వీటిలో ఏ వర్గం లేకపోయినా పార్టీ ఈనాడు నేత బలిష్ఠంగా ఉండేది కాదన్నది అయనకు తెలుసు. తెరాస పార్టీకి పునాది వేసిన సమయం నుండి పార్టీలో ముఖ్యనేతలుగా ఉన్న తొలి వర్గంలో మంత్రి ఈటెల కూడా ఒకరు. అందుకే ఆయనకు గత ప్రభుత్వంతో పాటు ఇప్పుడు కూడా కీలక మంత్రి పదవిలో ఉన్నారు.

అయితే, ఈటెల అప్పుడప్పుడు మాటల తుఫాన్ రేపుతుంటారు. ఆ మధ్య అయన మాట్లాడుతూ తెరాస పార్టీకి ఓనర్లం మేమే అంటూ ఆయన చేసిన మాటలు సంచలనం రేపాయి. పార్టీలో ఏదో వివాదం నడుస్తుందని అయన మాటలకు అర్ధాలు మొలకెత్తాయి. తెరాస పార్టీకి ఓనర్ ఒక్కరేనని.. తామంతా వర్కర్లం మాత్రమే అంటూ కొందరు నేతలు ఆయన మాటలకు కౌంటర్లు కూడా ఇచ్చారు.

ఆ తర్వాత ఈటెల కూడా అయన మాటలకు అర్ధాలు వేరులే అంటూ జవాబిచ్చుకున్నారు. కాగా ఇప్పుడు తాజాగా ఆయన ఆవేదనతో కూడిన మాటలు.. కొందరికి శాపనార్ధాలు పెడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సంచలనంగా మారాయి. తనకు పోరాడటం తెలుసుగానీ, దొంగ దెబ్బ తీయడం చేతగాదని.. తాను కోట్లు ఖర్చు చేసినా ఇంతవరకూ ఎవ్వరి దగ్గరా చేయి చాచలేదనన్నారు.

అంతవరకూ ఊరుకొని మంత్రి.. తనని ఓడించాలంటూ గతంలో చాలామంది ప్రయత్నించారనీ, కానీ ప్రజలు ఎప్పుడూ ధర్మం తప్పలేదని.. ఒకవేళ ప్రజలే ధర్మం తప్పి ఉంటే తను ఓడిపోయేవాడినన్నారు. తాను నమ్మినవారే మోసం చేస్తే కాస్త బాధకలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. నమ్మక ద్రోహం చేసేవారు ఎప్పటికీ బాగుపడరని.. అంతకు అంత అనుభవించి తీరుతారని శాపనార్ధాలు కూడా పెట్టారు.

ఈటెల వ్యక్తంచేసిన ఆవేదన మాటలు మరోసారి చర్చకు దారితీసింది. ఈటెల రాజేందర్ కు సొంత జిల్లాలో వ్యతిరేకంగా ఓ గ్రూపు తయారై గత ఎన్నికల సమయంలో ఆయన ఓటమికి పనిచేసిందని తెలుస్తుంది. అందుకే అయన ఈ మాటలు మాట్లాడినట్లుగా చెప్తున్నారు.

కాగా, ఇది ఈ ఒక్క జిల్లాలోనే కాదు చాలాచోట్ల పైన చెప్పుకొన్న రెండు వర్గాల మధ్య విబేధాలు ఉన్నాయని పార్టీలో అందరికీ తెలిసిన నిజమే. అయితే.. పార్టీ ఇప్పుడు లీడింగ్ లో ఉండడంతో ఆ విబేధాలు అణుచుకు ముందుకువెళ్తున్నారు. ఈటెల లాంటి వాళ్ళు ఆవేదన ఇలా బయటకి కక్కేస్తున్నారు.. అంతే!

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   4 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle