newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

మంత్రి ఈటల‌కు ఎర్త్ పెడుతున్నారా..?

26-08-201926-08-2019 07:18:16 IST
Updated On 26-08-2019 12:36:49 ISTUpdated On 26-08-20192019-08-26T01:48:16.109Z26-08-2019 2019-08-26T01:47:38.959Z - 2019-08-26T07:06:49.056Z - 26-08-2019

మంత్రి ఈటల‌కు ఎర్త్ పెడుతున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ అత్యంత న‌మ్మ‌క‌స్తుడు. పార్టీని స్థాపించిన నాటి నుంచి కేసీఆర్‌కు న‌మ్మిన బంటు. ఉమ్మ‌డి రాష్ట్రంలో టీఆర్ఎస్ శాస‌న‌సభాప‌క్ష నేత‌గా పార్టీ వాణిని, తెలంగాణ వాదాన్ని అసెంబ్లీలో బ‌లంగా వినిపించిన నాయ‌కుడు.

రెండుసార్లూ కేసీఆర్ క్యాబినెట్‌లో ఎటువంటి అనుమానాలు లేకుండా చోటు ద‌క్కించుకున్న నేత‌. అయితే, ఇప్పుడు మాత్రం సీన్ రివ‌ర్స్ అయ్యింద‌నే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తోంది.

ఈసారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఈటెల రాజేంద‌ర్‌ను త‌ప్పించే యోచ‌న‌లో ముఖ్య‌మంత్రి ఉన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా రెండు ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్త‌నే ఈ ఊహాగానాల‌కు తెర‌లేప‌డంతో పాటు బ‌ల‌ప‌రుస్తున్నాయి. కేసీఆర్‌కు న‌మ్మ‌క‌స్తులైన నేత‌ల్లో ఒక‌రైన ఈటెల ప‌ట్ల ఇప్పుడు కేసీఆర్ కొంత అసంతృప్తితో ఉన్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఆయ‌న‌ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తార‌ని అంటున్నారు.

ఇటీవ‌ల తెలంగాణ‌లో కొత్త రెవెన్యూ చ‌ట్టం తీసుకువ‌చ్చేందుకు గానూ క‌లెక్ట‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ సుదీర్ఘ స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశ వివ‌రాలు బ‌య‌ట‌కు వెళ్ల‌నీయొద్ద‌ని ఆయ‌న క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు ఇచ్చారు.

అయితే, స‌మావేశ వివ‌రాల‌ను, కొత్త చ‌ట్టంలో తీసుకువ‌చ్చే మార్పుల‌ను మంత్రి ఈటెల లీక్ చేశార‌ని, త‌న‌కు ప‌రిచ‌య‌మున్న రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌ను పిలిపించుకొని చెప్పార‌నేది ఆయ‌నపై ఆరోప‌ణ‌.

ఈ విష‌యంలో ఈటెల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ సీరియ‌స్‌గా ఉన్నార‌ని, ఈటెల త‌న గొయ్యి తానే త‌వ్వుకున్నార‌ని చెబుతూ రెండు ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌చ్చాయి.

ఈ రెండు ప‌త్రిక‌ల్లో ఒక ప‌త్రిక టీఆర్ఎస్ ముఖ్యుల‌కు స‌న్నిహితుల‌ది. పైగా రెండు ప‌త్రిక‌ల్లోనూ ఒకే ర‌కంగా వార్త‌లు ఉన్నాయి. దీంతో ఈటెల‌ను త‌ప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా..? అందుకే ప‌త్రిక‌ల‌కు లీకులు ఇచ్చారా..? అనే అనుమానాలు తెలంగాణ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌లుగుతున్నాయి. అందుకే ఈ విధంగా క‌థ‌నాలు వ‌చ్చాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎవ‌రిపైనైనా చ‌ర్య‌లు తీసుకునేందుకు ప‌త్రిక‌ల్లో లీకులు ఇచ్చి క‌థ‌నాలు రాయించ‌డం ప్ర‌భుత్వ పెద్ద‌ల వ్యూహ‌మే అని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా తాము ఈటెల రాజేంద‌ర్‌ను క‌లిసిన మాట వాస్త‌వ‌మే అయినా.. ఓ త‌హ‌శీల్దార్ కుమారుడి చికిత్స‌కు సాయం చేయాల్సిందిగా కోరామ‌ని, క‌లెక్ట‌ర్ల స‌మావేశానికి సంబంధించి మంత్రి త‌మ‌కు ఎటువంటి వివ‌రాలూ చెప్ప‌లేద‌ని స్వ‌యంగా రెవెన్యూ సంఘాలు ప్ర‌క‌టించాయి.

అయితే, ఈటెల‌ను కేసీఆర్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌ప్పించ‌ర‌నే మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. నిరూప‌ణ కూడా కాని కార‌ణంతో ఈటెల రాజేంద‌ర్‌ను క్యాబినెట్ నుంచి త‌ప్పిస్తే ప్ర‌భుత్వంపై బీసీ వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. మ‌రి, ఏం జ‌రుగుతుందో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle