newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మంత్రినే ఇర‌కాటంలో ప‌డేస్తోన్న ఎమ్మెల్యే..!

14-03-202014-03-2020 12:41:23 IST
Updated On 14-03-2020 13:16:42 ISTUpdated On 14-03-20202020-03-14T07:11:23.519Z14-03-2020 2020-03-14T07:11:19.437Z - 2020-03-14T07:46:42.912Z - 14-03-2020

మంత్రినే ఇర‌కాటంలో ప‌డేస్తోన్న ఎమ్మెల్యే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు సోద‌ర భావంతో మెలిగిన ఇద్ద‌రు టీఆర్ఎస్‌ సీనియ‌ర్ నాయకులు ప్ర‌స్తుతం ఆధిప‌త్య చ‌ట్రంలో ఇరుక్కొని ఎవ‌రికి వారే అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాగా, వారి మ‌ధ్య ఉన్న అన్న‌ద‌మ్ముల బంధం ఎందుకు తెగింది..? అస‌లు ఇంత‌కీ వారెవ‌రు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు సంబంధించి రాజ‌కీయ విశ్లేష‌కులు ఇలా పేర్కొంటున్నారు.

గ‌త ప్ర‌భుత్వంలో ఇద్ద‌రు మంత్రులు ఉమ్మ‌డి జిల్లాలో సీనియ‌ర్ నాయ‌కులు. అన్నా అన్నా అనుకుంటూ ఎక్క‌డా లేని ఆప్యాయ‌త‌లు చూపించేసుకునేవారు. ఇప్పుడేమో అన్న‌న్న‌న్న‌న్నా.. అనుకునేంత‌లా దూరం పెరిగింది. నిన్నా.., మొన్న‌టి వ‌ర‌కు క‌లిసిమెలిసి ఉన్న ఆ ఇద్ద‌రు నాయ‌కులు ఇప్పుడు ఆధిప‌త్య చ‌ట్రంలో ఇరుక్కొని ఎవ‌రికి వారే అన్న రీతిలో త‌యార‌య్యారు. అ అన్న‌ద‌మ్ముల అనుబంధం ఇప్పుడెందుకు తెగిపోయింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డికి, ఆదిలాబాద్ ప్ర‌స్తుత ఎమ్మెల్యే జోగు రామ‌న్న‌ల మ‌ధ్య పొస‌గ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. గ‌తంలో ఉమ్మ‌డి జిల్లాలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డికి బ‌ల‌మైన కేడ‌ర్ ఉండేది. ఈసారి జిల్లాలో ఏకైక మంత్రిగా ఆయ‌న ఉన్నారు. మొత్తం ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలంద‌రితోనూ మంత్రికి స‌ఖ్య‌త లేన‌ట్టు కార్య‌క‌ర్త‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

జోగు రామ‌న్న, ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి 2014లో ఏర్ప‌డిన టీఆర్ఎస్ తొలి ప్ర‌భుత్వంలో మంత్రులుగా ఉన్నారు. నిర్మ‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుండి బీఎస్పీ అభ్యర్థిగా గెలిచిన ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి ఆ తువాతి కాలంలో టీఆర్ఎస్ పార్టీలో చేర‌డంతో మంత్రి ప‌ద‌వి ఇచ్చారు సీఎం కేసీఆర్. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుండి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా గెలిచిన జోగురామ‌న్న‌కు కూడా మంత్రి ప‌ద‌వి వ‌రించింది. ఇద్ద‌రూ 2018 వ‌ర‌కు కేసీఆర్ ప్ర‌భుత్వంలో మంత్రులుగా ప‌నిచేశారు.

2018లో జ‌రిగిన ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత ఏర్ప‌డిన కొత్త ప్రభుత్వంలో నిర్మ‌ల్ నుండి స్వ‌ల్ప మెజార్టీతో గెలుపొందిన ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి వ‌రించింది. ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుండి భారీ మెజార్టీతో గెలిచిన జోగు రామ‌న్న‌కు మాత్రం చోటు ద‌క్క‌లేదు. అప్ప‌టి నుండి వీరి మ‌ధ్య విభేదాలు మొద‌ల‌య్యాయ‌ని అంటున్నారు. అది కాస్తా ఇప్పుడు ఆధిప‌త్య పోరుగా మారింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో జ‌రిగిన డీసీసీబీ, డీసీఎం ఎన్నిక‌ల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి సిఫార్సు చేసిన అభ్య‌ర్థికి జోగు రామ‌న్న చెక్‌పెట్టార‌ట‌. మంత్రి చెప్పిన అభ్యర్థిని డీసీసీబీ చైర్మన్ కాకుండా అన్నీతానై ద‌గ్గ‌రుండి మ‌రీ త‌న మ‌నిషికి అవ‌కాశం ఇప్పించుకున్నార‌ట రామ‌న్న‌. అన్ని విష‌యాల్లోనూ మంత్రి ఇత‌ర ఎమ్మెల్యేల‌పై జులుం చెలాయిస్తున్నార‌నే కార‌ణంగానే డీసీసీబీ అధ్య‌క్ష ప‌ద‌వి విష‌యంలో ఇత‌ర ఎమ్మెల్యేలు కూడా జోగురామన్న‌కు మ‌ద్ద‌తు ప‌లికిన‌ట్టు కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఇద్ద‌రి మ‌ధ్య విభేదాల విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌ప‌డిపోయింది.

జోగురామ‌న్న ఎంతో సౌమ్ముడిగా పేరుగాంచిన ఎమ్మెల్యే. మంత్రివ‌ర్గంలో ఉన్న‌ప్పుడు ఉమ్మ‌డి జిల్లాలోని అంద‌రు ఉమ్మెల్యేల‌కు పెద్ద‌న్న‌ల్లా ఉండేవార‌ట‌. అప్పుడు ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి కూడా మంత్రిగా ఉండేవారు. కానీ, రామ‌న్న క‌లుపుగోలుత‌నం ఆయ‌న‌కు న‌చ్చేది కాద‌ట‌. ఆదిలాబాద్‌లో ఇద్ద‌రూ సీనియ‌ర్ ఎమ్మెల్యేలే. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌లో ఆదిలాబాద్‌లో జోగు రామ‌న్న కుమారుడు చైర్మ‌న్ రేస్‌లో కౌన్సిల‌ర్‌గా బ‌రిలో నిలిచి గెలుపొందారు. కానీ, అక్క‌డ మిగ‌తా టీఆర్ఎస్ కౌన్సిల‌ర్‌ల‌కు బీజేపీ నుండి గ‌ట్టిపోటి ఉండ‌టంతో జోగు రామ‌న్న అన్నీ తానై క‌ష్ట‌ప‌డి కుమారుడి కోసం కౌన్సిల‌ర్ల‌ను గెలిపించుకున్నార‌ని అంటున్నారు.

తాజాగా, ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, రామ‌న్న‌ల మ‌ధ్య వైరం తారా స్థాయికి చేరుకుంద‌ని కార్య‌క‌ర్త‌లే అంటున్నారు. ఇంద్ర‌క‌ర‌ణ్‌కి ఉమ్మ‌డి జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా మంచి సంబంధాలు లేక‌పోవ‌డం, జోగు రామ‌న్న‌కు దాదాపు ఎమ్మెల్యేలుగా మ‌ద్దతుగా నిలుస్తుండ‌టం మంత్రిని ఇర‌కాటంలో ప‌డేస్తోంద‌ట‌. ప్ర‌తీ విష‌యంలోనూ మంత్రిపై ప‌రోక్షంగా రామ‌న్న గ‌ళం ఎత్తుతున్నారు.

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   10 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   6 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   13 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   16 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   18 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle