newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మండలికి కవిత ఎంపిక వ్యూహాత్మకమేనా?

19-03-202019-03-2020 12:43:54 IST
2020-03-19T07:13:54.455Z19-03-2020 2020-03-19T07:12:42.494Z - - 19-04-2021

మండలికి కవిత ఎంపిక వ్యూహాత్మకమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అత్యంత వ్యూహాత్మకంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమార్తె, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. నిజామాబాద్‌లో ప్రభ తగ్గిన తెరాసకు మళ్లీ పట్టు తెచ్చిపెట్టడం, డీఎస్, అరవింద్‌ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడం, వీలును బట్టి కేబినెట్‌లోకి కూడా కవితను తీసుకోవడం అనే త్రిముఖ వ్యూహంతోనే శాసనమండలి నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా కవితను బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. 

ఈ వ్యూహంలో భాగంగానే మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. టీఆర్‌ఎస్‌ పక్షాన పలువురు ఆశావహులు పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశించినప్పటికీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ మాత్రం తన కుమార్తె, నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు. 

మంత్రుల నివాస సముదాయంలో బుధవారం ఉదయం నిజామాబాద్‌ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలతో కవిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం మంత్రి వేముల, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్‌ దాఖలు చేసేందుకు నిజామాబాద్‌కు కవిత బయలుదేరి వెళ్లారు. బుధవారం శాసన మండలి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన కవితను వేద పండితులు ఆమె నివాసంలో కలిసి ఆశీర్వచనాలు అందజేశారు. 

నిజామాబాద్‌ శాసనమండలి స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా జిల్లాలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పార్టీ అభ్యర్థిగా కవితను సీఎం కేసీఆర్‌ ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. స్థానిక సంస్థల కోటాకు సంబంధించి జిల్లాలో 824 మంది ఓటర్లు ఉండగా, టీఆర్‌ఎస్‌కు 532, కాంగ్రెస్‌కు 140, బీజేపీకి 85 ఓట్లు ఉన్నాయి. దీంతో శాసన మండలికి కవిత ఎన్నిక అత్యంత సునాయాసంగా జరుగుతుందని లెక్కలు వేసి బరిలోకి దించినట్లు తెలిసింది.

మండలికి కవిత ఎంపిక వ్యూహాత్మకంగా జరిగిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. కవితకు మార్గం సుగమం చేసేందుకు మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డిని రాజ్యసభకు పంపడంతోపాటు, కవితను స్థానిక సంస్థల కోటాకు ఎంపిక చేయడం ద్వారా దొడ్డిదారిన మండలికి వచ్చారనే అపప్రథ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌కు పట్టు ఉన్న నిజామాబాద్‌లో డి.శ్రీనివాస్‌తో పాటు, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా కవిత ఎంపిక జరిగినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. కవితను కేబినెట్‌లో తీసుకునే ఉద్దేశంతోనే మండలికి ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ ఎంపీగా పార్లమెంటులో కవిత అడుగుపెట్టారు. 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండో పర్యాయం టీఆర్‌ఎస్‌ పక్షాన నిజామాబాద్‌ నుంచి పోటీ చేసిన కవిత ఓటమి చవిచూశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత పార్టీ కార్యకలాపాల్లో అంతగా కనిపించడం లేదు. ఈ నెల 13న జరిగిన రాజ్యసభ సభ్యుల నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు అసెంబ్లీకి వచ్చిన కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదే రోజు కవిత జన్మదినం కావడంతో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   4 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   38 minutes ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   8 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   8 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   10 minutes ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   9 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle