newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

భ్రమలు కోల్పోయిన జనం.. హుజార్ నగర్ ఓటర్ల నాడి ఏమిటి?

20-10-201920-10-2019 08:27:15 IST
2019-10-20T02:57:15.334Z20-10-2019 2019-10-20T02:57:09.408Z - - 28-02-2020

భ్రమలు కోల్పోయిన జనం.. హుజార్ నగర్ ఓటర్ల నాడి ఏమిటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజకీయ పార్టీల తీవ్ర ప్రచారం నేపథ్యంలో హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారం పరిసమాప్తి అయింది కానీ ఓటర్లు మాత్రం ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి చూపడంలేదని తాజాసమాచారం. నాగార్జున సాగర్ సాగునీటి ప్రాజెక్టు యొక్క భారీ కాలువల పొడవునా పరచుకున్న విశాలమైన ఆకుపచ్చటి వరిపొలాలతో పచ్చగా కనబడే హుజార్ నగర్ నియోజక వర్గం అధికార పార్టీ సత్తా ఎంటో తేల్చేయనుంది. 2.36 లక్షల మంది ఓటర్లు, 28 మంది అభ్యర్థులతో కూడిన హుజార్ నగర్ ఇప్పుడు అతిపెద్ద రాజకీయ సమరానికి వేదికగా ఉంటోంది. అక్టోబర్ 21న పోలింగ్ జరగనుండటంతో పాలక, ప్రతిపక్షాలు ఈ నియోజకవర్గంలో ఫలితాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. 

గత మే నెలలో సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎమ్ఎల్ఏ ఉత్తమ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ దఫా హుజూర్ నగర్‌లో ఉత్తమ సతీమణి పద్మావతి రెడ్డి బరిలో నిలబడడంతో రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు గెల్చుకున్నా, 12 మంది ఎమ్మెల్యేలు పాలక తెలంగాణ రాష్ట్రసమితి శిబిరంలోకి చెక్కేయడంతో ప్రధాన ప్రతిపక్ష స్థానం కూడా చేజార్చుకుంది. ఇలాంటి నేపథ్యంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికలు రావటంతో కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. 

హుజూర్ నగర్ ఉపఎన్నిక అధికార తెరాసకు కూడా తీవ్ర పరీక్ష కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన దాదాపు సంవత్సరం తర్వాత ఉప ఎన్నిక జరుగుతుండంతో తెరాస కూడా ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోది. అయితే రాజకీయ పక్షాలు తమ శక్తినంతా ధారపోసి ప్రచారం చేసినా ఓటర్లు మాత్రం అంతగా ఆసక్తి చూపకపోవడం విశేషం. 

2018లో ఉత్తమ కుమార్‌పై పోటీచేసిన తెరాస అభ్యర్థి ఎన్నారై సైది రెడ్డి 7 వేల ఓట్లతేడాతో ఉత్తమ్ కుమార్‌ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఇదే స్థానంలో ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాగా గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీజేపీ ఈసారి డాక్టర్ కోటా రామారావును పార్టీ తరపున అభ్యర్థిగా నిలిపింది. ఇంకా చాలామంది ఇతరులతోపాటు జర్నలిస్టు వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తీన్మార్ మల్లన్న కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో ఉండే హుజూర్ నగర్‌లో 50శాతం పైగా వెనుకబడిన కులాలకు చెందిన వారే ఉన్నారు. కానీ ఒక్క బీజేపీ తప్పితే ప్రధాన రాజకీయ పక్షాలేవీ ఈ నియోజక వర్గంలో ఆ కమ్యూనిటీల నుంచి అభ్యర్థిగా ఎవరినీ నిలపలేదు. వ్యవసాయం ప్రదాన వృత్తిగా ఉండి సమృద్ధిగా నీటి వనరులు లభ్యమవుతున్న హుజూర్ నగర్‌లో రెడ్డి, కమ్మ రెండు ప్రధాన కులాలుగా ఉంటున్నాయి. తెరాస, కాంగ్రె్స్ పార్టీలు రెండూ రెడ్డి అభ్యర్థులనే బరిలోదింపాయి. ఇక సామాజిక న్యాయ ప్రతినిదిగా తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ ప్రక్రియను ప్రారంబించారు.

అయితే రాజకీయ పార్టీల ప్రతిష్ట ఎలా ఉన్నా హుజూర్ నగర్ ఉప ఎన్నికపై విద్యాధికులు పెదవి విరుస్తున్నారు. ఈ ఉప ఎన్నిక నియోజకవర్గంలోని సంపన్నులు, శక్తిమంతుల వ్యక్తిగత వ్యవహారంగానే ఉంటుందని, వీళ్లలో ఎవరూ ప్రజల సమస్యలను పట్టించుకోరని బీటెక్ గ్రాడ్యుయేట్ తరుణ్ చెబుతున్నారు. ఒక వ్యక్తి నా కళ్ల ఎదుటే ప్రమాదానికి గురై కొట్టుకుంటుంటే ఎవరూ అతని గురించి పట్టించుకోలేదని అందుకే ఎవరు గెలిచినా, ఓడినా నియోజకవర్గ ప్రజలకు ఏమీ ఒరగదని చెప్పారు.

పైగా సంవత్సరం లోపు అసెంబ్లీ ఎన్నిక, తర్వాత సార్వత్రిక ఎన్నికలు, మళ్లీ ఉప ఎన్నిక జరుగుతుంటడంతో ప్రజల్లో ఆసక్తి చచ్చిపోయింది. అందుకే రాజకీయ పక్షాల ప్రచారం ఎంత ఉధృతంగా జరిగినా ప్రజల అనాసక్తి మాత్రం అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

2018లో హుజార్ నగర్ స్థానాన్ని గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడినుంచి గెలుపుసాధించి తాను అధికారపక్షానికి ఇప్పటికీ బలమైన ప్రత్యర్థినే అని నిరూపించుకోవాలని ఆరాట పడుతోంది. మరోవైపున ఉప ఎన్నికలు అన్నింట్లోనూ వరుసగా గెలుపు సాధించిన చరిత్రను మరోసారి పునరావృతం చేయాలని టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తోది. రాజకీయ పార్టీల ప్రచార సంరంభం, ప్రజల నిరాసక్తత మధ్య హుజూర్ నగర్ పీఠం ఎవరిదో త్వరలోనే  తేలనుంది.

 

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   3 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   5 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   5 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   10 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   10 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   12 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   13 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   13 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   13 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle