newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

భైంసా ప్రశాంతం.. 144వ సెక్షన్ కొనసాగింపు

17-01-202017-01-2020 16:55:21 IST
2020-01-17T11:25:21.623Z17-01-2020 2020-01-17T11:25:19.923Z - - 24-02-2020

భైంసా ప్రశాంతం.. 144వ సెక్షన్ కొనసాగింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉద్రిక్తతలు, 144 సెక్షన్ తో అట్టుడికిన భైంసా పట్టణం ప్రశాంతంగానే వుంది. అయితే, ముందు జాగ్రత్తచర్యలగా 144 సెక్షన్‌ ఐదో రోజు కొనసాగుతోంది. గత ఆదివారం పట్టణంలోని కోర్వాగల్లీలో ఇరు వర్గాల ఘర్షణ రాళ్లదాడికి దారితీయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవలు నిలిచిపోయాయి. 

అన్ని  ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి నిర్మల్‌ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారానికి ప్రత్యేక అనుమతులు ఇస్తున్నారు పోలీసులు. అయితే విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి.

భైంసాలో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఎలాంటి ఆందోళనలు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. భైంసాలో పరిస్థితులు బాగోలేవనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయని, వాటిని నమ్మవద్దన్నారు హోంమంత్రి. వదంతులు వ్యాపించేవారిపై చర్యలు తప్పవన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle