newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

భూ వివాదాల్లో తలదూర్చొద్దురా భయ్.. కేసీఆర్ హెచ్చరిక

16-11-201916-11-2019 10:52:00 IST
Updated On 16-11-2019 12:54:08 ISTUpdated On 16-11-20192019-11-16T05:22:00.305Z16-11-2019 2019-11-16T05:21:44.584Z - 2019-11-16T07:24:08.533Z - 16-11-2019

భూ వివాదాల్లో తలదూర్చొద్దురా భయ్.. కేసీఆర్ హెచ్చరిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఒక్కో భూమిని నలుగురయిదుగురు క్లెయిమ్ చేస్తున్న ప్రత్యేక పరిస్థితుల్లో తెరాసకు చెందిన ప్రజాప్రతినిధులెవ్వరూ భూవివాదాల్లో తలదూర్చవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ప్రజాప్రతినిధులకు చెందిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఇప్పటికే వివాదాస్పదమైన భూ లావాదేవీలు చేసి ఉంటే వెంటనే వాటిని పరిష్కరించుకుని పక్కకు జరగాలని సూచించారు. తన మాట వినకపోతే భవిష్యత్తులో భూములకు సంబంధించిన ప్రతివివాదం ప్రజాప్రతినిధుల మెడకే చుట్టుకుంటుందని కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించారు.

కేసీఆర్ హెచ్చరికకు బలమైన కారణాలున్నాయి. ఇటీవలే తన కార్యాలయంలోనే దారుణ హత్యకు గురైన అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ విజయారెడ్డి హత్య కేసు నిందితుడితో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో విపక్ష పార్టీలు కూడా తెరాసకు చెందిన ప్రజాప్రతినిధిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశాయి ఆ తర్వాత ఇద్దరు కూడా తమకు సంబంధం లేదని ప్రకటనలు చేసినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. ఈ ఘటనతోనే భూవివాదాల జోలికి వెళ్లకుండా తెరాస ప్రజాప్రతినిధులకు కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు.

Image result for abdullapurmet mro

హైదరాబాద్‌తో పాటు శివారు జిల్లాల భూము ల విలువలు అమాంతంగా పెరగడంతో.. భూములతో ముడిపడి ఉన్న నేరాలు శిఖరస్థాయికి చేరుకుంటున్నాయి. తహసీల్దార్‌ విజయా రెడ్డి హత్య ఘటన తర్వాత రెవెన్యూ యంత్రాంగానికి డజనకుపైగా హెచ్చరికలు వచ్చినట్లు కేసులు నమోదయ్యాయి. ఏకంగా ఓ ఆర్డీవోకు కూడా కానిస్టేబుల్‌ ఫోన్‌ చేసి.. విజయా రెడ్డికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించాడు. కిరోసిన్‌, పెట్రోల్‌ బాటిళ్లతో కార్యాలయాలకే వస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, ఒకవైపు రక్షణ చర్యలు తీసుకుంటూనే, సొంత పార్టీ ప్రజా ప్రతినిధులకు నచ్చచెప్పే పనిలో సీఎం పడ్డారు. భూ వివాదాలతో ముడిపడిన విజ్ఞప్తులు వస్తే.. ఎండార్స్‌ చేసి, సంబంధిత రెవెన్యూ యంత్రాంగానికి సిఫారసు చేయరాదని, భవిష్యత్తులో ఏం జరిగినా అది రికార్డుగా మారుతుందని హెచ్చరించారు.

అయితే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరికీ ఏదో ఒక విధంగా భూ వివాదాల్లో పాత్ర ఉంటున్న నేపథ్యంలో భూవివాదాల జోలికి వెళ్లద్దంటూ కేసీఆర్ చేస్తున్న హెచ్చరికను వీరు మన్నిస్తారా అనేదే పెద్ద సందేహంగా మారింది.

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   3 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   6 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   6 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   11 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   11 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   12 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   13 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   13 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   14 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle