newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భూ తగాదాలకు ఫుల్ స్టాప్ – ధరణి పోర్టల్

09-09-202009-09-2020 16:53:16 IST
2020-09-09T11:23:16.599Z09-09-2020 2020-09-09T11:23:08.546Z - - 12-04-2021

భూ తగాదాలకు ఫుల్ స్టాప్ – ధరణి పోర్టల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్ర రెవెన్యూ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెలంగాణ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. భూముల  తగాదాలు, లచాలు, పంచాయితీలు, లిటిగేషన్లకు అవకాశమే లేకుండా సమగ్ర రెవెన్యూ చట్టాన్ని రూపొందించింది. ధరణి వెబ్‌సైట్‌ ద్వారా సమగ్ర సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నూతన రెవెన్యూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.

ధరణి పోర్టల్ త్వరలో అందుబాటులోకి వస్తుందనీ, భూముల వివరాలను రెండు విభాగాలుగా చేస్తూ ధరణిలో అందుబాటులో ఉంచుతామనీ చెప్పారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను పక్కాగా నిర్దేశించడం ఈ బిల్లు ప్రత్యేకత.  తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు  కొత్త చట్టంతో చరమగీతం పాడుతున్నామని సీఎం ప్రకటించారు. 

కొత్త రెవెన్యూ బిల్లు తీసుకురావడానికి మూడేళ్లు కసరత్తు చేసి మరీ...లొసుగులకు అవకాశం లేని విధంగా రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర భూభాగం 2.75కోట్ల ఎకరాలు. ధరణి పోర్టల్‌ ఈ భూముల వివరాలన్నీ ఉంటాయి. ప్రపంచంలో ఏమూలనైనా ధరణిని చూసుకోవచ్చు. మొత్తం లావాదేవీలకు ధరణి పోర్టలే ఆయువు పట్టు. కొత్త చట్టం ప్రకారం ఏ అధికారికీ విచక్షణాధికారాలు ఉండవు. లంచాలకో, ఒత్తిడులకో లొంగి భూ రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు.

ఎందుకంటే రాష్ట్రంలోని ప్రతి ఇంచు భూమీ, వివరాలూ ధరణిలో ఉంటాయి. ఇక రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కూడా పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు.  వ్యవసాయ భూములనే ఎమ్మార్వోలు రిజిస్ట్రేషన్‌ చేస్తారు. వ్యవసాయేతర భూములను సబ్‌ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్‌ చేస్తారు. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం తహసీల్దార్లే జాయింట్‌ రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారు  క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పోర్టల్‌లో అప్‌డేట్‌ అవుతాయి. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ సహా అన్ని సేవలు ఏకకాలంలో పూర్తవుతాయి. ఉమ్మడి ఒప్పందం ఉంటేనే వారసత్వ భూ విభజన జరుగుతంది. డిజిటల్‌ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు ఉంటాయి.  

అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులపై చర్యలు, సర్వీసు నుంచి తొలగించే అధికారం చట్టంలో ఉంటుంది. దీంతో అక్రమార్కుల ఆటలు ఇక సాగవన్న విశ్వాసం ప్రజలలో పాదుకొంటుంది.    ఇక భూ తగాదాల పరిష్కారంలో జాప్యం నివారించేందుకు రాష్ట్రంలో రెవెన్యూ కోర్టుల స్థానంలో ల్యాండ్‌ ట్రిబ్యునళ్లును ఏర్పాటు చేయనుంది.‌ ఆర్‌వోఆర్‌ - 2020 చట్టంతో రెవెన్యూ సంస్కరణలకు తెరతీసిన ప్రభుత్వం రెవెన్యూ కోర్టులను పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో ల్యాండ్ ట్రైబ్యునల్ ఏర్పాటు అవుతాయి. వీటి వల్ల వివాద పరిష్కారం జాప్యం లేకుండా జరుగుతుంది.    


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle