newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

21-09-202021-09-2020 17:13:54 IST
Updated On 21-09-2020 18:54:16 ISTUpdated On 21-09-20202020-09-21T11:43:54.025Z21-09-2020 2020-09-21T11:43:50.560Z - 2020-09-21T13:24:16.631Z - 21-09-2020

భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సోమవారం నుంచి మావోయిస్టుల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. వారోత్సవాలకకు సంబంధించిన లేఖ ఒకటి మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జగన్ పేరుమీద విడుదలయ్యింది. దీంతో వరంగల్ జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు వారోత్సవాల్లో భారీ విధ్వంసం చేసేందుకు మావోయిస్టులు సిద్దమయ్యారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. 

డిజిపి మహేందర్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లాలో పోలీసులను అప్రమత్తం చేశారు. అలాగే గ్రేహౌండ్స్ బలగాలు, బాంబ్ స్క్వాడ్స్ సిబ్బంది ఏజెన్సీ ప్రాంతాలకు చేరుకున్నాయి. మరోవైపు మావోయిస్టుల ఆచూకీ కోసం పోలీస్ బలగాలు వరంగల్ చుట్టుపక్కల అడవులను జల్లెడపడుతున్నాయి. మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ పికెటింగ్ లు ఏర్పాటు చేసి, వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనుమానంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

ఇటీవలే డీజీపీ మహేందర్ రెడ్డి ఆదిలాబాద్ లో ఐదురోజులు ఆకస్మిక పర్యటన చేశారు. జిల్లా అంతటా తిరిగిన ఆయన ఆదిలాబాద్ అడవులపై దృష్టి సారించారు. అక్కడున్న పోలీసుల స్థానంలో కొత్తవారిని అపాయింట్ చేసి, మావోల కదలికలపై ఎప్పటి కప్పుడు సమాచారం అందజేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ లో మావోలు భారీ ఎత్తున విధ్వంసం సృష్టించనున్నారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికతో మరింత అప్రమత్తమయ్యారు. 

వరంగల్ రేంజ్ ఐజీ ప్రమోద్ కుమార్ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్, ఐబీ అధికారులతో టచ్ లో ఉంటూ సమాచారం తెలుసుకుంటున్నారు. ముందుగానే గొత్తికోయగూడెంలలో ప్రజలను అప్రమత్తం చేసి గూడెంలోకి కొత్తగా వచ్చినవారికి షెల్టర్ ఇవ్వొద్దని ఆదేశించారు పోలీసులు. 

 

 

 

 

 

 

 


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle