newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారీ అవినీతి అనకొండ... తాహశీల్దార్ నాగరాజు అరెస్ట్

15-08-202015-08-2020 13:06:28 IST
2020-08-15T07:36:28.022Z15-08-2020 2020-08-15T07:36:15.272Z - - 15-04-2021

భారీ అవినీతి అనకొండ... తాహశీల్దార్ నాగరాజు అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి భారీగా లంచం తీసుకుంటూ తన ఇంట్లోనే దొరికిపోయాడో తాహశీల్దార్. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి మరో అవినీతి తిమింగలం చిక్కింది. భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం తెలంగాణలో చర్చనీయాంశం అయింది. 

ఏఎస్‌రావు నగర్‌లోని ఆయన నివాసంలో  తాహశీల్దార్ నాగరాజు కోటి 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు.నాగరాజును అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. నాగరాజు ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. రాంపల్లి ప్రాంతంలో 28 ఎకరాల భూ సెటిల్మెంట్ల విషయంలో పెద్ద మొత్తంలో ఈ లంచం తీసుకుంటూ ఉండగా.. ఏసీబీ అధికారులు నాగరాజును పట్టుకున్నారు. 

ఈ కేసుకు సంబంధించి మొత్తం ముగ్గురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఏసీబీ చరిత్రలోనే ఇదే అతి పెద్ద ట్రాప్‌గా తెలుస్తోంది.తహసీల్దార్ నాగరాజు సహా రియల్ ఎస్టేట్ బ్రోకర్ శ్రీనాథ్, కన్నడ అంజిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఈ ఎమ్మార్వోపైనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉందని తెలిసింది. మూడు నెలల క్రితమే ఆ కేసు నుంచి విముక్తి పొందినట్లు అధికారులు తెలిపారు.

సత్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కు చెందిన వ్యక్తుల నుంచి కోటి 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన నాగరాజు ఇంట్లోనే డబ్బులు తీసుకున్నారు. తాహశీల్దార్ నాగరాజు ఇంట్లో భారీగా పత్రాలు స్వాధీనం చేసుకోవచ్చని తెలుస్తోంది. గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. మూడు నెలల క్రితమే ఆ కేసు నుంచి విముక్తి పొందినట్లు సమాచారం.

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   14 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle