newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారీవర్షాలు, వరదలతో వరంగల్ ఉక్కిరిబిక్కిరి

17-08-202017-08-2020 13:34:20 IST
Updated On 17-08-2020 13:11:02 ISTUpdated On 17-08-20202020-08-17T08:04:20.558Z17-08-2020 2020-08-17T07:38:34.711Z - 2020-08-17T07:41:02.692Z - 17-08-2020

భారీవర్షాలు, వరదలతో వరంగల్ ఉక్కిరిబిక్కిరి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రుతుపవనాలు దేశమంతటా విస్తరించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. తెలంగాణ‌లో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలో కురుస్తున్నవర్షాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

మరోవైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలపై పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. వర్షాలు, వరదల వల్ల సాధ్యమైనంత వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ ఎం.మహేందర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల పోలీసు అధికారులు అప్రమత్తంగా వున్నారు, వరంగల్ నగరం వరదలతో జలదిగ్బంధం అయింది. నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 

ఐదురోజులుగా కురుస్తున్న వానలతో వరంగల్ వర్షపునీటిలో చిక్కుకుపోయింది. వరంగల్‌ నగర వాసులు మూడు రోజులుగా నీళ్లలోనే నానుతున్నారు. వరంగల్‌, హన్మకొండ, కాజీపేటలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో… లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.వరంగల్‌, కరీంనగర్‌ ప్రధాన రహదారి అయిన నయీంనగర్‌ రహదారిపై భారీగా వరద ప్రవహిస్తూనే ఉంది. హైదరాబాద్‌కు చెందిన మూడు డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రస్తుతం వరంగల్‌లో సేవలు అందిస్తున్నాయి. 

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర బంగాళాఖాతంలో 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ అల్పపీడనం దశ, దిశ ఇప్పటివరకు తెలియరాలేదు. రాగల 12 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురం లో 16.6 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వాజీద్ లో 15.4 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ లో 12.8 సెంటీమీటర్లు, ములుగు జిల్లా మంగపేటలో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ రూరల్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాలో 8 నుంచి 9 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది. వరంగల్ అర్బన్, కరీంనగర్, కొమురం భీం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో అల్పపీడనం ఏర్పడితే అది బలపడే పరిస్థితిని బట్టి వర్షపాతం అంచనా వేయనున్నారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   an hour ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle