భారీగా పెరుగుతున్న వినియోగం.. విద్యుత్ కష్టాలు తప్పవా?
24-02-202024-02-2020 08:15:17 IST
2020-02-24T02:45:17.551Z24-02-2020 2020-02-24T02:44:53.536Z - - 15-04-2021

చలికాలం త్వరగా వీడ్కోలు తీసుకుంది. శివరాత్రి తర్వాత శివశివా అంటూ చలికాలం వెళ్లిపోతుందంటారు. అది నిజమే. శివరాత్రి తర్వాత చలి వణుకు తగ్గిపోయింది. వేసవి తాపం ప్రారంభం అయింది. సూర్యూడి లేలేత కిరణాల్లో వేడి ప్రారంభమయింది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగం విద్యుత్ ఇంజనీర్లు, అధికారులకు వణుకు పుట్టిస్తోంది. గతంతో పోలిస్తే భారీగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో వత్తిడి బాగా పెరిగిందని చెబుతున్నారు. రియల్ బూం కారణంగా ప్లాట్లకు, డూప్లెక్స్ ఇళ్ళ సంఖ్య భారీగా పెరిగింది. కొత్త విద్యుత్ కనెక్షన్లకు తోడు పగటి ఉష్ణోగ్రతలు రెట్టింపు అవుతుండటంతో విద్యుత్ వినియోగం కూడా అదే స్థాయిలో రికార్డు అవుతోంది. గత నెలలో రోజులలో సగటు విద్యుత్ వినియోగం 42 ఎంయూలు ఉండగా, ప్రస్తుతం50 ఎంయూలకు చేరింది. మార్చి చివరి నాటికి 60 ఎంయూలు దాటే అవకాశం ఉంది. ఒత్తిడిని తట్టుకోలేక ఇప్పటికే పలు ఫీడర్లు తరచూ ట్రిప్పవుతూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ కారణంగా అనధికారికంగా కోతలు తప్పడంలేదని విద్యుత్ శాఖ చెబుతోంది. దీంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి మరెలా ఉండనుందోనని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 54 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం వీటిలో 44 లక్షలకుపైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 7 లక్షలకుపైగా వాణిజ్య కనె క్షన్లు ఉన్నాయి. 50 వేలకుపైగా పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నట్టు అధికారులు లెక్కలు చెబుతున్నారు. లక్షకు పైగా వీధిదీపాల కనెక్షన్లు వున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 33/11కేవీ సబ్స్టేషన్లు 306, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ 96882, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ 802పైగా, 33కేవీ, 11కేవీ, ఎలీ్టలైన్స్ 52142 కిమిపైగా ఉన్నాయి. రాజేంద్రనగర్, హబ్సిగూడ, సరూర్‌నగర్, సైబర్‌సిటీ, మేడ్చల్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్స్ కొత్తగా ఏర్పడ్డాయి. శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తుండటం, కొత్త నిర్మాణాలు, పరిశ్రమలు వెలుస్తుండటం వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందంటున్నారు. 2006లో నగరంలో 24.12 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండేవి. అప్పట్లో ఏసీలు తక్కువే. ఇప్పుడు ఈఎంఐల పుణ్యమాని ఏసీలకు గిరాకీ ఏర్పడింది. చిన్న, మధ్యతరగతి జనం కూడా ఇంటిలో ఏసీ చల్లదనానికి అలవాటుపడిపోయారు. దీంతో కొత్త కనెక్షన్లకు తోడు పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతుండటంతో వినియోగం రెట్టింపవుతోంది. గతంలో పారిశ్రామిక వినియోగం ఎక్కువగా ఉంటే... ఇప్పుడు మాత్రం గృహావసరాలకు విద్యుత్ వినియోగం పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు సగటున 48 నుంచి 49 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతోంది. దీనిలో 45 నుంచి 50 శాతం అంటే సుమారు 24 ఎంయూల విద్యుత్ పరిశ్రమలు వినియోగిస్తున్నట్లు సమాచారం. మిగిలినది గృహ, ఇతర వాణిజ్య అవసరాలకు ఖర్చవుతోంది. విద్యుత్ వినియోగానికి తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి పెరగడం లేదని అధికారులు అంటున్నారు. దీంతో శివారు ప్రాంతాల్లో విద్యుత్ కోతలు తప్పేలా లేవు.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
an hour ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
3 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
4 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
6 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
6 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
7 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
5 hours ago

నా రూటే సెపరేటు
9 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా