newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారత్ బయోటెక్‌‌కు గవర్నర్ అభినందనలు

02-07-202002-07-2020 08:16:19 IST
Updated On 02-07-2020 10:58:11 ISTUpdated On 02-07-20202020-07-02T02:46:19.756Z02-07-2020 2020-07-02T02:46:13.558Z - 2020-07-02T05:28:11.303Z - 02-07-2020

భారత్ బయోటెక్‌‌కు గవర్నర్ అభినందనలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై పోరుకి అనేకమంది శాస్త్రవేత్తలు అహర్నిశలు పనిచేస్తున్నారు. భారతీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ తొలి కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కృషిని గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసి విడుదలకు సిద్ధమయింది.   డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం పొందిన తొలి వ్యాక్సిన్ క్యాండిడేట్ ఇది కావడం విశేషం.

అంతేకాదు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు కూడా ఈ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌కు అనుమతులు రావడం విశేషం. ఐసీఎంఆర్, పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ఈ సంస్థ వ్యాక్సిన్ తయారీ కోసం పని చేస్తోంది. కొవాక్సిన్ పేరిట అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఈ నెలలో మనుషులపై ప్రయోగిస్తారు. దేశీయంగా తొలిసారిగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రశంసల జల్లు కురిపించారు. 

హైదరాబాద్‌లోని జెనోమ్ వ్యాలీకి చెందిన ఈ సంస్థ ఐసీఎంఆర్, పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను డెవలప్ చేసిందని తమిళిసై తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో మీ కృషి అభినందనీయం అని ఆమె కొనియాడారు. కరోనా వ్యాక్సిన్ రూపొందించడం దేశానికే గర్వకారణమని భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణా ఎల్లా తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జంతువులపై కొవాక్సిన్‌ను ప్రయోగించగా.. క్షేమమేనని తేలిందని, వాటి రోగనిరోధకశక్తి పెరిగిందన్నారు. దేశీయంగా తొలి కరోనా వ్యాక్సిన్ రూపొందించిన భారత్ బయోటెక్.. అమెరికాకు చెందిన విస్కాన్‌సన్ యూనివర్సిటీతో కలిసి క్లోరోఫ్లూ పేరిట ముక్కులో వేసిన వ్యాక్సిన్‌ తయారీ కోసం పని చేస్తోంది. మరిన్ని కరోనా వ్యాక్సిన్లు త్వరలో ప్రయోగాలకు సిద్ధం అవుతున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle