newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారత్-చైనా ఘర్షణ.. తెలంగాణ కల్నల్ బలిదానం

16-06-202016-06-2020 19:43:09 IST
Updated On 17-06-2020 11:40:34 ISTUpdated On 17-06-20202020-06-16T14:13:09.343Z16-06-2020 2020-06-16T14:12:40.167Z - 2020-06-17T06:10:34.604Z - 17-06-2020

 భారత్-చైనా ఘర్షణ.. తెలంగాణ కల్నల్ బలిదానం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు కరోనా వైరస్ తో ప్రపంచం యుద్దం చేస్తుంటే సరిహద్దుల్లో మాత్రం భారతీయ సైనికులకు ముష్కరులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ఒకవైపు పాక్, మరో వైపు చైనా కవ్వింపులకు పాల్పడుతోంది. తాజాగా చైనా సరిహద్దులో సైనికుల ఉపసంహరణ జరుగుతుంటే.. చైనా సైనికులు ఘర్షణకు దిగారు. 

భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. దేశంకోసం ప్రాణత్యాగం చేసినవారిలో  తెలంగాణ లోని  సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు ఉండడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి, 

కల్నల్ సంతోష్ మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్‌ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈమధ్యే హైదరాబాద్ బదలీ అయినా కరోనా వైరస్ వల్ల అక్కడే ఉండిపోయాడు. త్వరలో తన భర్త వచ్చేస్తాడని ఆశించిన భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4)లు షాక్ కి గురయ్యారు. వీరు ఢిల్లీలో వున్నారు. 

లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సరిహద్దుల్లో  భారత్‌, చైనా బలగాలు బాహాబాహీకి దిగాయి. ఈ గొడవల్లో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్‌ సంతోష్ బాబుతో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.

సంతోష్‌ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. సంతోష్‌ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సంతోష్ అత్తగారు తీవ్ర వేదనకు గురికావడంతో బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. తల్లి తీవ్ర ఆవేదనతో వున్నారు. తన ఒక్కగానొక్క కొడుకు దేశం కోసం త్యాగం చేశాడని గర్వంగా ఉన్నా, గర్భశోకంతో బాధ అనుభవిస్తున్నానని తల్లి మంజుల అన్నారు. ఈఘటన రాత్రి జరిగినా ఈ విషాద వార్త తనకు చెబితే తన ఆరోగ్యం పాడవుతుందని తన కోడలు చెప్పలేదని ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు. 

  


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle