newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భాగ్యనగరానికి బ్యాడ్ న్యూస్.. లాక్ డౌన్ కొనసాగింపు?

19-04-202019-04-2020 19:55:22 IST
Updated On 19-04-2020 19:56:53 ISTUpdated On 19-04-20202020-04-19T14:25:22.106Z19-04-2020 2020-04-19T14:25:20.085Z - 2020-04-19T14:26:53.309Z - 19-04-2020

భాగ్యనగరానికి బ్యాడ్ న్యూస్.. లాక్ డౌన్ కొనసాగింపు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ రెండో దశ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడిలో మన దేశానికున్న బలమైన ఆయుధంగా పాటిస్తున్న లాక్ డౌన్ వలన ఎన్నో నష్టకష్టాలున్నా ప్రభుత్వాలు ప్రజల ప్రాణాల కోసం అన్నిటికి ఓర్చి ముందుకు వెళ్తున్నాయి. కాగా ఈనెల 20 నుండి లాక్ డౌన్లో సడలింపులు ఒకే చెప్పిన కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది.

కేంద్రం సడలింపులు ఇచ్చినా.. మార్గదర్శకాలను విడుదల చేసినా ఇందులో నిర్ణయాధికారాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చింది. దీంతో 20 తర్వాత తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది. దీనికి తోడు తెలంగాణకు సంబంధించి కరోనా కట్టడి, లాక్ డౌన్ పొడగింపు-సడలింపు అంశాలపై ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ అనంతరం కేసీఆర్ రాష్ట్రంలో పరిస్థితులను ప్రకటించనున్నారు. అయితే లాక్ డౌన్ సడలింపులలో మిగతా రాష్ట్రమంతా ఎలా ఉన్నా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో మాత్రం మే 3 వరకు లాక్ డౌన్ మరింత కఠినంగా అమలుచేసే అవశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసి ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది.

ప్రస్తుతం నగరంలో కరోనా విజృంభణ కొసాగుతూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 800 పైగా కేసులు నమోదైతే 400కు పైగా కేసులు హైదరాబాద్ లోనివి. ఇలాంటి క్రమంలో మహా నగరంలో సడలింపు ఇస్తే పరిస్థితిని అదుపుచేయడం కష్టమే అవుతుంది. ఇప్పటికీ రోజుకి పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా రాష్ట్రంలో ఉన్న పాజిటివ్ కేసులలో సగం కేసులు హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి.

మే 3 వరకు హైదరాబాద్ లో కఠినంగా లాక్ డౌన్ అమలు చేసి అనంతరం మే నెలాఖరు వరకు కూడా స్వల్ప సడలింపులతోనే అమలుచేయాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారట. నగర పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా కొనసాగుతూనే ఉందని ఇలాంటి పరిస్థితిలో సడలింపు ఇస్తే ప్రజలను అదుపు చేయడం తలకి మించి భారమే అవుతుందని జీహెచ్ఎంసీ అభిప్రాయపడినట్లుగా తెలుస్తుంది.

ప్రస్తుతం నగర జనాభా సుమారు కోటి పదిలక్షలు ఉండొచ్చని అభిప్రాయం. ఇప్పటికే నాలుగు వందలకు పైగా కేసుకు బయటపడగా ప్రస్తుతం ఎంతమందిలో ఈ వైరస్ ఉందో అన్నది ఎవరికీ అంతుబట్టని పరిస్థితి. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో మరోపక్క కేంద్రం సడలింపు అనే కథనాలు ఎప్పుడు వచ్చిందో నగరంలో జనసంచారం కూడా మొదలైంది.

గత రెండు రోజులుగా పగటి సమయాలలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుందంటే పరిస్థితి ఎలా మారిందో అర్ధం చేసుకోవచ్చు. అదే రాష్ట్ర ప్రభుత్వం సడలింపు ప్రకటనలు చేస్తే ప్రజా రవాణా మరికాస్త పెరగడం ఖాయం. ఇది ఒక విధంగా నగర ప్రజల ప్రాణాలు గాల్లో పెట్టేసినట్లే అవుతుంది. దీంతో రాష్ట్రం సంగతెలా ఉన్నా నగరంలో మాత్రం లాక్ డౌన్ సడలింపు కష్టమే అంటున్నారు.

 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   11 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   20 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle