newssting
BITING NEWS :
తీవ్ర వివాదాల మధ్యనే పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు. ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసినా వెనక్కు తగ్గని కేంద్రం * రాజ్యసభలో కొనసాగుతున్న దుమారం. విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను హరివంశ్‌ తూట్లుపొడిచారాని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ విమర్శ * అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరపన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిలనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల కోసం మరోసారి ప్రయత్నాలు. శశికళ విడుదల కోసం అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ ఢిల్లీకి పయనం. సుప్రీం కోర్టు న్యాయవాదులు, న్యాయనిపుణులతో చర్చలు * ఆరు నెలల తర్వాత సోమవారం ఉదయం సందర్శకుల కోసం తెరుచుకున్న ఆగ్రాలోని అంతర్జాతీయ చారిత్రక పర్యాటక కేంద్రం తాజ్‌మహల్‌. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బారులు తీరిన సందర్శకులు. సోమవారం 160 మంది పర్యాటకులు ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు. రెండు షిఫ్తుల్లో రెండు వేలమందికి అనుమతులు * మహారాష్ట్రలోని భీవండి నగరంలో తీవ్ర విషాదం. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి పది మంది మృతి, మరో 20 మందికి గాయాలు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మర సహాయక చర్యలు * నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ. నేడు ధర్మాసనం ముందు లిస్ట్ అయిన 93 పిటిషన్‌లు విచారణ. ఆన్‌లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను విచారించనున్న ధర్మాసనం * నేటి నుండి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాల పునరుద్ధరణ. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా దర్శనాలు నిలిపివేయగా నేటి నుండి తిరిగి దర్శనాలు ప్రారంభం. సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో దర్శనం. పిల్లలకు, వృద్ధులకు ఆలయంలోకి నో ఎంట్రీ * భారీ వర్షాలతో పోటెత్తిన కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదులకు వరద. పలు గ్రామాలు ముంపునకు గురవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. పలు గ్రామాల్లో వరదలలో చిక్కుకున్న 48 మంది రైతులు, వ్యవసాయ కూలీలు, రక్షించిన ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు * కేంద్రం జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ ఉత్తర్వులు. నేటి నుంచి 50 శాతం మంది టీచర్లు బడులకు హాజరు. సోమవారం నుంచి విద్యార్థులు లేకుండానే కొనసాగనున్న పాఠశాలలు * ఈశాన్య బంగా‌ళా‌ఖాతంలో ఆది‌వారం ఉదయం ఏర్పడిన అల్ప‌పీ‌డనం. సోమ‌వారానికి మ‌రింత బలపడి అను‌బం‌ధంగా 3.1 కి.మీ. నుంచి 7.6 కి.‌మీ. ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.

భాగ్యనగరానికి అగ్నిపరీక్ష ఈ రెండువారాలే..

02-04-202002-04-2020 08:14:40 IST
2020-04-02T02:44:40.118Z02-04-2020 2020-04-02T02:44:37.731Z - - 21-09-2020

భాగ్యనగరానికి అగ్నిపరీక్ష ఈ రెండువారాలే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌ ఇతరులకు సోకకుండా మనం బయటపడాలంటే కచ్చితంగా బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలంటూ ఉద్యమం తరహాలో బ్రేక్‌ ది చైన్‌.. అనే నినాదం హైదరాబాద్‌లో వెల్లువెత్తింది. గత పది రోజులుగా నగరంలో విస్తృతంగా వినిపిస్తున్న మాట ఇది. దాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఇంతకాలం దాని అమలు ఎలా ఉందో పక్కనపెడితే ఇకపై లాక్‌ డౌన్‌ను కచ్చితంగా అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు వారాలు అత్యంత కీలకం కానున్నాయి. 

రాష్ట్రం కరోనా హస్తాల్లో చిక్కుకొని విలవిల్లాడకుండా ఉండాలంటే తు.చ. తప్పకుండా లాక్‌‌డౌన్‌ అమలు కావాల్సిందే. కరోనా వైరస్‌ను తరిమి కొట్టాలంటే ఇప్పుడు మన చేతిలో ఉన్న ఏౖకైక ఆయుధం ఇదొక్కటే. పది రోజుల క్రితం లాక్‌డౌన్‌ను అమలులోకి తెచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ సహా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వినమ్రంగా పలుమార్లు ఇదే విషయాన్ని జనం ముందుంచారు.

అంతర్జాతీయ నిపుణులు, వైద్యులు పదేపడే చెబుతూ వచ్చారు. కానీ ఆ మాటలను ప్రజలు పెద్దగా లెక్క చేయకుండా రకరకాల కారణాలతో రోడ్లపైకి వచ్చి లాక్‌డౌన్‌ను అపహాస్యం చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. వచ్చే రెండు వారాలు లాక్‌డౌన్‌ స్ఫూర్తిని స్వచ్ఛందంగా అమలు చేయకుంటే ఇక పరిస్థితి చేయిదాటిపోవడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీన్ని ప్రజలు తీవ్రంగా పరిగణించి స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమైతే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసే అవకాశం ఉంటుందని లేకపోతే కరోనాను అదుపు చేయలేక విలవిల్లాడాల్సి వస్తుందంటున్నారు. వెరసి వచ్చే రెండు వారాలను సువర్ణావకాశంగా అభివర్ణిస్తున్నారు. 

కరోనా కోరల్లో చిక్కుకోవాలో లేక మహమ్మారిని తరిమి కొట్టాలో అన్నది ఇప్పుడు ప్రజల చేతుల్లోనే ఉంది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి క్వారంటైన్‌ గడువు మరో 4 రోజుల్లో ముగియనుండటంతో ఇక కరోనా వైరస్‌ ప్రభావం నుంచి మనం తప్పించు కున్నట్లేనని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ‘నిజాముద్దీన్‌’ ఉదంతం పరిస్థితిని ఒక్క సారిగా తీవ్ర ఆందోళనకరంగా మార్చేసింది. వెయ్యి మందికిపైగా తెలంగాణవాసులు ఈ సమావేశానికి హాజరై స్వస్థలాలకు వెళ్లి జనం మధ్య తిరగడంతో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

నిజాముద్దీన్‌ ప్రార్థనల రూపంలో కరోనా వైరస్‌ మన మధ్యకు తీవ్రంగా చొచ్చు కొచ్చిందన్న వార్తలు వెలువడ్డ రోజే జనం భయం, బాధ్యత లేకుండా వీధులను రద్దీగా మార్చేయడం ఆశ్చర్యం కలిగించింది. రాజధాని హైదరాబాదే కాదు... రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. పాలు, కూరగాయలు, మందులు, ఎమర్జెన్సీ అంటూ ఏదో పేరు చెప్పి ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఇలాంటి దృశ్యాలు కనిపించాయి.

ఉదయం 10 గంటలకు పాతబస్తీలోని మాదన్నపేట కూరగాయల మార్కెట్‌ జనంతో కిక్కిరిసి కనిపించింది. సగం మంది కనీసం రుమాలు కూడా ముక్కు, నోటికి అడ్డుగా కట్టుకోకపోవడం ఆందోళన కలిగించే అంశం. బుధవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడ్డ వారికి చికిత్స అందిస్తున్న హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రి ముందున్న ప్రధాన రహదారి వాహనాలతో కిటకిటలాడింది. సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్‌ కూడలిలో ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను నియంత్రిస్తుండగా సాధారణ రోజుల్లో తరహాలోనే వాహనాలు దూసుకొస్తున్న దృశ్యం అధికారులను నిరాశలో ముంచెత్తింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మల్లేపల్లి కూడలిలో ఒకరిని ఒకరు తగిలేంత దగ్గరగా యువకులు గుంపులుగా కూర్చున్నారు.

మన దేశంలో కనిపించిన కరోనా వైరస్‌ చైనాలో ఉన్నంత శక్తివంతమైనది కాదనే భావన తొలుత వ్యక్తమైంది. కానీ ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వైరస్‌ బారినపడి చనిపోయిన వారి శరీరంలో కనిపించిన లక్షణాలను బట్టి చూస్తే అది శక్తివంతమైనదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలంతా దీన్ని గుర్తించి సహకరిస్తేనే కరోనాను నియంత్రించగలం. అందుకు జనం ఒకచోట సమూహంగా చేరడాన్ని పూర్తిగా నియంత్రించాలి. జలుబు లక్షణాలున్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలి. పట్టణాల్లో జనం తీరును చూస్తే ఆందోళన కలుగుతోంది. రోడ్లపైకి చిన్న, చిన్న కారణాలతో వచ్చే వారిలో భయం, బాధ్యత కనిపించట్లేదు. అవసరమైతే వారిపై బలప్రయోగం చేయాల్సిందే. లేకుంటే రాష్ట్రం, తద్వారా దేశం బలవుతుందని వైద్య, ఆరోగ్య శాఖ  విశ్రాంత సీనియర్‌ అధికారి డాక్టర్‌ కె.ప్రతాప్ చెబుతున్నారు.

హైదరాబాద్‌లో సీనియర్ సర్జన్ డాక్టర్‌ రాజారెడ్డి ఈ విషయంపైనే మాట్లాడుతూ గ్రామాల్లో ఉంటున్న స్ఫూర్తి పట్టణాలకు ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా మన గ్రామాల్లో ప్రజలు ఎంతో స్ఫూర్తి ప్రదర్శిస్తున్నారు. బయటి నుంచి కొత్తవారు రాకుండా నియంత్రించి వైరస్‌ గ్రామంలోకి ప్రవేశించకుండా చూస్తున్నారు. ఇప్పుడు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. పని ఉంటే తప్ప బయటకు రావటం లేదు. గతంలోలాగా రచ్చబండ ముచ్చట్లు కనిపించట్లేదు. సర్పంచులు ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు చేపట్టారు. వారికి ప్రజలు సహకరిస్తున్నారని డాక్టర్ రాజారెడ్డి చెప్పారు.

 కానీ పట్టణాల్లో ఈ స్ఫూర్తి కొరవడింది. అకారణంగా జనం రోడ్లపైకి వచ్చి గుంపులుగా తిరుగుతున్నారు. ‘నిజాముద్దీన్‌’ వ్యవహారంతో ఆందోళన వ్యక్తమవుతున్నా మతపరమైన ప్రార్థనలకు ఒకచోటకు చేరుతున్నారు. మతం, వర్గం అని చూడకుండా ప్రభుత్వం కచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిన తరుణమిది. జనం మాట విననప్పుడు ప్రభుత్వం నిర్బంధంగా నిబంధనలు అమలు చేయాల్సిందే. ఓపికగా చెప్పి చూసినా ఫలితం లేనప్పుడు కఠినంగా ఉండైనా జనాన్ని నియంత్రించాలి. ఆ తరుణం ఆసన్నమైంది అని డాక్టర్ రాజారెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాదులో కూడా ఆర్మీ దిగి తాటతీస్తే తప్ప అవసరమున్నా లేకున్నా ఇళ్లలోంచి బయటకు వస్తున్న జనం ఆటలకు అడ్డుకట్ట పడదేమో.. దండం దశగుణం భవేత్ అనే మనం కోరుకోని బడితెపూజలే జనాలను నియంత్రిస్తాయా? అన్నది ఇప్పుడు కీలకప్రశ్న.

 

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

   3 hours ago


ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

   3 hours ago


స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

   3 hours ago


భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

   5 hours ago


బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

   6 hours ago


ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

   8 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?

కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?

   8 hours ago


ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

   9 hours ago


వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

   20-09-2020


కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

   20-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle