newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భాగ్యనగరంలో వలస కార్మికులకు కష్టమేనా?

04-07-202004-07-2020 08:28:58 IST
Updated On 04-07-2020 10:45:59 ISTUpdated On 04-07-20202020-07-04T02:58:58.969Z04-07-2020 2020-07-04T02:58:53.610Z - 2020-07-04T05:15:59.697Z - 04-07-2020

భాగ్యనగరంలో వలస కార్మికులకు కష్టమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటం, మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం.. జోరుగా జరుగుతుండటంతో  హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. తాజాగా తెలంగాణలో రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1892 పాజిటివ్ కేసులు న‌మోదు, ఎనిమిది మంది మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,658 కొత్త క‌రోనా కేసులు నమోదయ్యాయి.

ఉపాధి కోసం వలసొచ్చిన వారంతా తిరిగి సొంతూళ్ల బాట పట్టారు. హైదరాబాద్ లో పూర్తిగా స్థిరపడిన వారు మాత్రమే ఉండటానికి మొగ్గు చూపుతుండగా.. అద్దె ఇళ్లలో ఉంటూ.. ఆదాయం కోల్పోయిన వారు నగరంలో ఖర్చులు భరించలేక సొంతూరు వెళ్లి ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చనే ఉద్దేశంతో నగరాన్ని వీడుతున్నారు. దీంతో నగరంలోని చాలా కాలనీల్లో టు-లెట్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.

కరోనా ప్రభావం నగరంలోని సగటు జీవిపై తీవ్రంగా పడింది. లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత తిరిగి సాధారణ పరిస్థితులు ఉంటాయని నగరవాసులు ఆశించారు. కానీ ప్రస్తుత పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. 

దీంతో చిరువ్యాపారాలు చేసుకొని కుటుంబాన్ని సాకే వారిపై తీవ్ర ప్రభావం పడింది. వీధి వ్యాపారుల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకూ అందరిపైనా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ.. ఆర్థికంగా అంతగా బలంగా లేకపోవడంతో చిరు ఉద్యోగులు, చిన్నాచితకా వ్యాపారాలు చేసుకునే వారు, ఆటోలు, ట్యాక్సీలు నడుపుతూ బతికేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కరోనా ఎఫెక్ట్‌‌కు పిల్లల ఆన్‌లైన్ క్లాసులు తోడవడంతో... వారికి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌లాప్‌లు కొనిచ్చే పరిస్థితి లేక తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. పల్లెటూళ్లలో కరోనా భయం తక్కువగా ఉండటం, ఏదో ఒక పని చేసుకోవచ్చనే ధీమా, ఖర్చు తక్కువ అనే ఆలోచన అన్నీ కలిసి నగరంలో చాలా ఏళ్లుగా నివాసం ఉంటున్నవారు సైతం అద్దె ఇళ్లను ఖాళీ చేసి సొంతూరు వెళ్తున్నారు.

ఈ ప్రభావం ఇళ్లను అద్దెలకు ఇచ్చి.. ఆ డబ్బులతోనే జీవితం గడిపే ఇంటి యజమానులపైనా పడింది. ఒకప్పుడు టు-లెట్ బోర్డు కనిపిస్తే చాలు వారం గడిచే సరికి కచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి చేరేవారు. చిన్న కుటుంబం, అద్దె ఎక్కువగా ఇవ్వగలిగే వారికి ఓనర్లు ఇంటిని కిరాయికి ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటోంది. నగరంలోని ఏ ప్రాంతంలో చూసినా టు-లెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. 

అద్దె పెంచకపోగా.. ఇంతకు ముందున్న వారు చెల్లించినంత కూడా చెల్లించడానికి కొత్తగా వచ్చే వారు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో చాలా ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి.కొత్తగా ఎవరైనా ఇంట్లోకి వస్తే.. వారికి ఎక్కడ కరోనా ఉంటుందోననే అనుమానంతో కొందరు ఇంటి యజమానులు ఇల్లును ఖాళీగా ఉంచుతున్నారే కానీ అద్దెకు ఇవ్వడం లేదు. దీంతో నగరంలో ఖాళీ ఇళ్ల సంఖ్య పెరిగిపోతోంది. 

ఐటీ సంస్థల్లో పని చేసే చాలా మంది లాక్‌డౌన్ కంటే ముందే నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లారు. వాళ్లు అద్దెలు కడుతున్నప్పటికీ.. ఇళ్లు మాత్రం ఖాళీగా ఉంటున్నాయి. ఆఫీసులు తెరవకపోవడం, జనం ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో.. ఒకరిపై మరొకరు ఆధారపడి బతికే గొలుసు కట్టు దెబ్బతింది.హైదరాబాద్ వస్తే ఏదో ఒక పని చేసుకొని ఉన్నంతలో బాగా బతకొచ్చనే ధీమా గతంలో ఉండేది. కానీ కరోనా దెబ్బకు పరిస్థితి మొత్తం మారిపోయింది. నగరంలో బతకడం కష్టమేనంటూ వలస జీవులు వెనక్కి మళ్లుతున్నారు.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle