newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భాగ్యనగరంలో కరోనా హాట్ స్పాట్స్.. రంగంలోకి అదనపు బలగాలు!

09-04-202009-04-2020 14:25:47 IST
Updated On 09-04-2020 14:38:50 ISTUpdated On 09-04-20202020-04-09T08:55:47.495Z09-04-2020 2020-04-09T08:55:45.210Z - 2020-04-09T09:08:50.054Z - 09-04-2020

భాగ్యనగరంలో కరోనా హాట్ స్పాట్స్.. రంగంలోకి అదనపు బలగాలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ముందుగా హైదరాబాద్ నగర పరిధిలో 12 ప్రాంతాలను కరోనా హాట్ స్పాట్స్ గా గుర్తించి ఇక్కడ ప్రత్యేక చర్యలను ప్రారంభించింది.

నగరంలోని రాంగోపాల్ పేట్, షేక్ పేట్, రెడ్ హిల్స్, మలక్ పేట్ సంతోష్ నగర్, కూకట్ పల్లి, యూసుఫ్ గూడ, చందానగర్, మూసాపేట్, కుత్బుల్లాపూర్ గాజులరామారం, అల్వాల్, మయూరినగర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాలను హాట్ స్పాట్స్ గా ప్రకటించిన జీహెచ్ఎంసీ ఈ ప్రాంతాలలో ప్రత్యేక చర్యలను ప్రారంభించింది. ఎక్కడిక్కడ రసాయనాలను స్ప్రే చేయడంతో పాటు పరిశుభ్రతలో ప్రత్యేక జాగ్రత్తలను మొదలుపెట్టింది.

ముందుగా ఆయా ప్రాంతాలను కరోనా కంటెన్మెంట్ కేంద్రాలుగా గుర్తించిన ప్రభుత్వం అదనపు బలగాలతో పాటు బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రజలను ఆయా ప్రాంతాల నుండి బయటకు రాకుండా .. బయట ప్రాంతాల వ్యక్తులను ఆయా ప్రాంతాలలోకి వెళ్లకుండా చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఒకవేళ ఏదైనా ప్రజల అవసరాలను స్థానిక పోలీసులు, ఆరోగ్య అధికారులు నిర్ణయం తీసుకుంటారని ప్రకటించింది.

ఈ ప్రాంతాలలో రాష్ట్రప్రభుత్వం నియమించిన ప్రత్యేక బృందాలు ఇంటింటికి పర్యటించి ప్రజల ఆరోగ్యంపై సమాచారాలను సేకరించనున్నారు. ఏదైనా అనుమానాలుంటే అధికారులకు చేరవేసి వారిని అబ్జర్వేషన్లో ఉంచనున్నారు. అవసరమైతే ఆయా వ్యక్తులను క్వారంటైన్ కేంద్రాలను తరలించనున్నారు. ఈ ప్రాంతాలలో ప్రతి గల్లీ, ప్రతి బస్తీలను కూడా శానిటైజేషన్ చేయనున్నారు.

ఇక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఐదు వందల వైపు పరుగులు పెడుతుంది. బుధవారం ఒక్కరోజే 49 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం 453 మందికి చేరింది. వీరిలో 11 మంది ఇప్పటికే చనిపోగా 45 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇక విదేశాల నుండి వచ్చిన పాజిటివ్ కేసులన్నీ ఇప్పటికే పూర్తిగా కోలుకున్నాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

అయితే ఢిల్లీ నిజాముద్దీన్ నుండి వచ్చిన వారు .. వారి కుటుంబాలు.. సన్నిహితులు మధ్యనే ఇప్పుడు కొత్త కేసులు నమోదవుతున్నాయని.. వారే ఇప్పుడు క్వారంటైన్ కేంద్రాలలో కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఇక 453 మందిలో ఒక్కరు కూడా వెంటిలేటర్ మీద చికిత్స తీసుకొనే పరిస్థితిలో లేరని అందరూ సాధారణ చికిత్సకి స్పందిస్తున్నారని మంత్రి తెలిపారు.  

ఢిల్లీ నుండి వచ్చిన రాష్ట్రానికి చెందిన 1100 మందిని.. వారితో కాంటాక్ట్ అయిన మొత్తం మూడువేల మందిని క్వారంటైన్ చేశామని వైద్యశాఖ ప్రకటించింది. మరోవైపు జిల్లాలో కూడా హాట్ స్పాట్స్ గురించి ప్రత్యేక చర్యలను తీసుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కరీంనగర్ లో డ్రోన్ కెమెరాలతో పోలీసులు ప్రజలను బయట తిరగకుండా బస్తే కాస్తున్నారు. నిజామాబాద్ లో రెడ్ అలెర్ట్ ప్రకటించి మరింత కఠినతరం చేయగా మిగతా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు.

 

 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle