newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భలే ఛాన్సులే.. తెలంగాణ విద్యార్ధులకు బంపరాఫర్

20-06-202020-06-2020 10:00:32 IST
Updated On 20-06-2020 11:47:09 ISTUpdated On 20-06-20202020-06-20T04:30:32.285Z20-06-2020 2020-06-20T04:22:53.656Z - 2020-06-20T06:17:09.657Z - 20-06-2020

భలే ఛాన్సులే.. తెలంగాణ విద్యార్ధులకు బంపరాఫర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కష్టకాలంలో స్కూల్స్ నడవలేదు.. కొన్ని పరీక్షలు రాసినా.. వాటిని పూర్తిగా నిర్వహించలేని గడ్డుపరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను రద్దుచేసింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చి అందరినీ పాస్ చేసింది. 

ఇటు తెలంగాణలో యూజీ, పీజీ పరీక్షల నిర్వహణ అంశంపై సందిగ్ధత కొనసాగిందది. చివరకు పరీక్షల రద్దుకే మొగ్గుచూపింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. పరీక్షల నిర్వహణ అంశంపై ఉన్న సందిగ్ధతకు తెరదించింది ప్రభుత్వం.  ఇటీవల పదో తరగతి పరీక్షలను రద్దు చేసి..ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్ధులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే డిగ్రీ ఫైనల్ ఇయర్, పీజీ పరీక్షలను రద్దుచేసింది ప్రభుత్వం. 

బీఎ, బీఎస్సీ, బీకాం డిగ్రీ, పీజీ, బీటెక్‌ పరీక్షలను సైతం పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  తాజాగా డిగ్రీ, బీటెక్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉన్నత విద్యాశాఖ అధికారులు, ఇంచార్జి వీసీలు, రిజిస్ట్రార్లు, ప్రొఫెసర్లు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అందరూ కూడా పరీక్షలను రద్దు చేసి.. డిగ్రీ ఫస్ట్, సెకండియర్ విద్యార్ధులను ప్రమోట్ చేయాలని సూచించినట్లు సమాచారం. ఇక ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కు ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా పాస్ చేయాలని అధికారులు ప్రతిపాదించారు. 

టెంత్ ఫలితాలు ఎప్పుడంటే? 

టెన్త్ పరీక్షలను రద్దు చేసి.. విద్యార్ధులందరినీ ప్రమోట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇప్పుడు వారికి ఇంటర్నల్ మార్కులు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడమే మిగిలింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పరీక్షల విభాగం విద్యార్ధులకు ప్రతి సబ్జెక్టులో 20 ఇంటర్నల్ మార్కులకు ఎన్ని వచ్చాయో వాటిని 5 రెట్లు చేసి గ్రేడ్లు ఇవ్వనుంది.

అటు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అందరూ కూడా పాస్ కాబట్టి.. ఫలితాలను ప్రకటించడం కంటే నేరుగా మెమోలను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తులు ప్రారంభించింది. ఇక ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు అయితే.. సుమారు లక్షన్నర మంది విద్యార్ధులకు ఇంటర్నల్స్‌లో 20కి 20 వేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉండవు.

విద్యార్ధులందరినీ కూడా పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు అందరూ కూడా పైతరగతులకు ప్రమోట్ అయినట్లే భావించాలి. దీంతో ఫెయిల్ అయ్యేవారు ఎవ్వరూ ఉండరు. అందుకే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఉండదని రాష్ట్ర విద్యాశాఖ చెబుతోంది. దీంతో విద్యాశాఖపై కాస్త భారం తగ్గనుంది. 

ఇదిలా ఉంటే ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా నివారణ చర్యలు తీసుకుంటూ ముందు 8, 9, 10 తరగతులను ప్రారంభించనుంది.  తొలుత ఆగస్టు 3 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రతి పాఠశాల, కాలేజీలో ప్రత్యేకంగా ఒక ఐసొలేషన్‌ గదిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇక తరగతుల నిర్వహణ రెండు విడతలుగా కొనసాగుతుంది. 

అలాగే 7-10 తరగతుల పుస్తకాలు ముద్రించి జిల్లాలకు పంపించారు. 1-6 తరగతులకు సంబంధించి పుస్తకాల ముద్రణ తుదిదశకు చేరింది. మరోవైపు ఎంసెట్‌ జులై 27 నుంచి 31 వరకు జరుగుతుంది. డిగ్రీ కాలేజీలు ఆగస్టు 1న పునఃప్రారంభం అవుతాయి. మొదటి ఏడాది డిగ్రీ విద్యార్థులకు సెప్టెంబరు 15న విద్యా సంవత్సరం ఆరంభం అవుతుంది. ఇంజనీరింగ్‌ వారికి సెప్టెంబరు 2 నుంచి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు సెప్టెంబరు 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle