newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భద్రాద్రి రాములోరి చుట్టూ రాజుకున్న కొత్త వివాదం!

13-02-202013-02-2020 13:48:46 IST
Updated On 13-02-2020 15:05:51 ISTUpdated On 13-02-20202020-02-13T08:18:46.896Z13-02-2020 2020-02-13T08:18:42.706Z - 2020-02-13T09:35:51.837Z - 13-02-2020

భద్రాద్రి రాములోరి చుట్టూ రాజుకున్న కొత్త వివాదం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భద్రాద్రి రాములవారి చరిత్ర గురించి దేశంలోని హిందువులందరికీ తెలిసిందే. ఇక మన తెలుగు వారికైతే అయన విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయనపై సినిమాలకు కూడా కొదువేలేదు. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే కళ్యాణం చూసేందుకు దేశదేశాలలో ఉన్న తెలుగు వారు సైతం క్యూలు కట్టి కల్యాణ ఘటాన్ని కనులారా చూసి తరించాలని ఆరాటపడతారు. అందుకు ఎంతటి ప్రయాసాలకైనా ఓర్చుకుంటారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ పెళ్లి నిశ్చయమైనా తొలి ఆహ్వానం ఆ భద్రాద్రి రాములవారి పాదాల చెంత ఉంచే కుటుంబాలు వేలల్లోనే ఉన్నాయి. అక్కడ నుండి తీసుకెళ్లే తలంబ్రాలు తమ వివాహా బంధాన్ని గొప్పగా మారుస్తుందని ఆశపడే జంటలు కోకోల్లలుగా ఉన్నాయి. అయితే సరిగా ఇప్పుడు ఆ భద్రాద్రి రాములవారి కళ్యాణం సమయంలో ఉచ్చరించే మంత్రాల దగ్గరే ఓ వివాదం మొదలైంది.

రాములవారికి నిర్వహించే నిత్య కల్యాణ ప్రవచనాలను చదివే సమయంలో ‘రామచంద్ర స్వామినే వరాయ’ అని చెప్పాల్సి ఉండగా.. ‘రామనారాయణ స్వామినే వరాయ’ అని మార్చివేసి అర్చకులు అపచారం చేస్తున్నారని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి ఆరోపిస్తుంది. దీనిపై తమ వద్ద ఉన్న ఆధారాలను కూడా చూపిస్తున్న భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, దేవస్థానానికి చెందిన వైదిక సిబ్బంది మాత్రం.. భద్రాదిల్రో వెలసిన శ్రీరామచంద్రుడిని కోదండ రాముడుగా, భద్రాద్రి రాముడుగా, వైకుంఠ రాముడుగా, ఓంకార రాముడుగా, రామనారాయణుడుగా కొలవడం జరుగుతోందని.. వైకుంఠం నుంచి వచ్చి భద్రుని కోరికపై శంఖుచక్రాలు, ధనుర్బాణాలతో కొలువై ఉన్న స్వామి వారు కాబట్టి రామనారాయణుడుగా భావించాలని పేర్కొంటున్నారు.

ఇదే విషయాన్ని తమ అనువంశిక అర్చకత్వంలో ఎందరో పెద్దలు ప్రస్తావించడాన్ని వైదిక సిబ్బంది ఉదాహరిస్తున్నారు. అయితే, శతాబ్దాలుగా వస్తున్న రామచంద్ర స్వామినే వరాయ’ అని చదివే సంప్రదాయానికి తూట్లు పొడుస్తూ రామనారాయణ స్వామినే వరాయ’ అని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి ప్రశ్నిస్తోంది.

అంతేకాదు, త్వరలో దీనిపై స్పందిస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తామంటున్న భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి సభ్యులు. అప్పటికీ ఆలయ వైదిక సిబ్బంది స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు స్పష్టంచేశారు. గతంలో కూడా పలుమార్పు చెలరేగిన ఈ వివాదం ఈసారి మాత్రం కాస్త గట్టిగానే వినిపిస్తుండడంతో ఇది ఎటు దారి తీసుకుందన్నది రాములవారి భక్తులను కలవరపెడుతుంది.

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   11 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   20 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle