newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బ్రేకింగ్.. తెలంగాణలో తొలి కరోనా డెత్

28-03-202028-03-2020 19:38:33 IST
Updated On 28-03-2020 19:38:25 ISTUpdated On 28-03-20202020-03-28T14:08:33.762Z28-03-2020 2020-03-28T14:05:45.951Z - 2020-03-28T14:08:25.306Z - 28-03-2020

బ్రేకింగ్.. తెలంగాణలో తొలి కరోనా డెత్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి నిరోధానికి తెలుగు రాష్ట్రాలు పకడ్బందీ చర్యలు చేపట్టాయి. లాక్ డౌన్ అమలవుతోంది. ఎవరినీ ఇంటినుంచి బయటకు రానివ్వడం లేదు. ఈనేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా మరణం కేసు నమోదైంది. రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి ఓ వ్యక్తి ప్రాణాలకు వదిలాడు. ఖైరతాబాద్‌కు చెందిన 74 సంవత్సరాల వృద్ధుడు కరోనా వైరస్ బారినపడి చనిపోయినట్టు తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. చనిపోయిన వ్యక్తి కొద్ది రోజుల క్రితం అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరారని తెలిపారు. అతనికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని కానీ అతను చనిపోయిన తరువాత రిపోర్టులు వచ్చయన్నారు. అయితే మరణించిన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణలో తేలింది.

మరోవైపు  రెడ్ జోన్ల విషయంలో మీడియాలో వస్తున్న వార్తలను మంత్రి ఖండించారు. రంగారెడ్డి జిల్లాలో రెడ్ జోన్ లు లేవని  కలెక్టర్ అమయ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.  కరోనా వైరస్ పై రంగారెడ్డి జిల్లాలో రెడ్ జోన్ లు  ప్రకటించినట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని జిల్లా కలెక్టర్ అమయ్  కుమార్  ప్రకటించారు. 

రంగారెడ్డి జిల్లా పరిధిలోని  కొన్ని  ప్రాంతాలను రెడ్ జోన్ లుగా  ప్రకటించినట్టు వచ్చిన వార్తలపై కలెక్టర్ స్పందించారు.  జిల్లాలో  కరోనా వైరస్  నివారణకు విస్తృత  చర్యలు చేపట్టామని,   ముఖ్యంగా లాక్ డౌన్  విజయవంతంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.  అత్యవసర పనులను నిమిత్తం వెళ్లే వారు తప్పనిసరిగా శోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మాస్కులు, గ్లౌజులు లేకుండా విధులు ఏలా నిర్వర్తిస్తున్నారని సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట రాజీవ్ రహదారి సమీపం పొన్నాల నుంచి పట్టణానికి వచ్చే దారిలో తన కారు కాన్వాయ్ ఆపి ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు లేకుండా రోడ్లు శుభ్రం చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పలకరించారు.

కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు కార్మికుల తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, గ్లౌజులు ఉన్న కిట్లను అందజేసి కరోనా వ్యాధి నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, అందులో భాగంగా మాస్కులు, గ్లౌజులు లేకుండా పారిశుద్ధ్య పనులు చేయొద్దని కార్మికులకు మంత్రి అవగాహన కల్పించారు.

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   11 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   20 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle