newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బ్రేకింగ్: తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా

20-03-202020-03-2020 14:01:38 IST
Updated On 20-03-2020 14:15:43 ISTUpdated On 20-03-20202020-03-20T08:31:38.013Z20-03-2020 2020-03-20T08:31:21.640Z - 2020-03-20T08:45:43.793Z - 20-03-2020

బ్రేకింగ్: తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా ఎఫెక్ట్ తెలంగాణలో పదవతరగతి పరీక్షలపై పడింది. పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్ట్ ఆదేశించింది. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడూ పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే, హైకోర్ట్ మాత్రం పిల్లల ఆరోగ్యం రీత్యా పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. 

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలన్నీ రీషెడ్యూల్ చేయాలని కోర్టు ఆదేశించింది. రేపు జరగాల్సిన పరీక్ష యధాతదంగా నిర్వహించాలని కోర్టు తెలిపింది. ఈ నెల 19 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగుకు సంబంధించిన రెండు పేపర్లు పూర్తయ్యాయి.శనివారం హిందీ పేపర్ రాయాల్సి వుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,530 కేంద్రాల్లో 5.34 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వల్ల శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. విద్యార్ధినీ, విద్యార్ధులకు హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో వుంచారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటుచేశామని, తల్లిదండ్రులు భయపడాల్సింది లేదని అధికారులు తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాలతో పరీక్షలు వాయిదా వేయక తప్పలేదు. 

ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకూ జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కరోనా వైరస్ వున్నా పరీక్షలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తే హైకోర్టులో పిల్ వేశారు. దీనిని అత్యవసరంగా భావించిన హైకోర్టు వెంటనే విచారణ జరిపింది. కరోనా భయంతో పిల్లలు పరీక్షలు ప్రశాంతంగా రాసే పరిస్థితులు లేవని పిటిషనర్ తరఫున న్యాయవాది పవన్ కుమా్ వాదించారు. వాదనల అనంతరం పరీక్షలు ఈనెల 30 వరకూ వాయిదా వేయాలని ఆదేశించింది. 

 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   27 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle