newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బ్రేకింగ్.. తెలంగాణలో టెన్త్ పరీక్షలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

19-05-202019-05-2020 13:04:07 IST
Updated On 19-05-2020 17:19:52 ISTUpdated On 19-05-20202020-05-19T07:34:07.265Z19-05-2020 2020-05-19T07:33:54.909Z - 2020-05-19T11:49:52.754Z - 19-05-2020

బ్రేకింగ్.. తెలంగాణలో టెన్త్ పరీక్షలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో టెన్త్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చింది. జూన్ మొదటి వారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చంది హైకోర్టు. జూన్ 3న కరోనా పరిస్థితులపై సమీక్ష జరపాలని, జూన్ 4న నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. అయితే పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని, కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటే పరీక్షలు నిలిపివేయాలని సూచించింది. టెన్త్ పరీక్షలు నిర్వహించుకోవాలన్న హైకోర్టు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. 

విద్యార్ధులకు ‘పది’ పరీక్షల కష్టాలు

టెన్త్ పరీక్షలు జరపడానికి సిద్ధంగా ఉందని హైకోర్టుకు  ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై హైకోర్టు విచారణ జరిపింది. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపిన అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. జూన్ 3 న కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలని ప్రభుత్వం హైకోర్టు అదేశించింది. జూన్ 4 న కోవిడ్ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు అదేశించడంతో ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేస్తోంది. జూన్ 8 న పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం కు సూచించడంతో ఏర్పాట్లు చేస్తోంది. 

ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలన్న హైకోర్టు..టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలంది. పరీక్షల నిర్వహణకు, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు అన్ని చర్యలు చేపడతామంది ప్రభుత్వం. పదవ తరగతి పరీక్షలకోసం తెలంగాణలో 5 లక్షలమందికి పైగా విద్యార్ధులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పలు రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను రద్దుచేశాయి. అంతర్గత పరీక్షల మార్కుల ఆధారంగా వారికి మార్కులు కేటాయించాలని నిర్ణయించాయి. 

గతంలో రెండు సబ్జెక్టులకు సంబంధించి 3 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా పరీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ బాలకృష్ణ అనే ప్రైవేట్ టీచర్ హైకోర్టు మెట్లెక్కాడు. పరీక్షలు ఆపాలంటూ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నాలుగు సబ్జెక్టులకు సంబంధించి 8 పరీక్షలు పెండింగులో పడ్డాయి. ఈనెలలో పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించడంతో అధికారులు కోర్టుని ఆశ్రయించారు.

కరోనానివారణ చర్యలు చేపడతామని, 5.50 లక్షలమంది విద్యార్ధుల భవిష్యత్తు కోసం పరీక్షల నిర్వహణకు అనుమతి కోరింది ప్రభుత్వం. తాజాగా పరీక్షల నిర్వహణకు హైకోర్టు సమ్మతించింది. పరీక్షా కేంద్రాల విషయంలో భౌతిక దూరం పాటించాలని, అది సాధ్యం కాని పక్షంలో పరీక్షా కేంద్రాలు మార్చాలని కోర్టు ఆదేశించింది. 

తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   15 minutes ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   15 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   11 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   18 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   21 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle