newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బ్రేకింగ్: కేసీయార్ అనూహ్య నిర్ణయం.. GHMC పరిధిలో మళ్లీ లాక్ డౌన్

28-06-202028-06-2020 19:30:39 IST
Updated On 28-06-2020 20:34:45 ISTUpdated On 28-06-20202020-06-28T14:00:39.724Z28-06-2020 2020-06-28T13:58:12.569Z - 2020-06-28T15:04:45.733Z - 28-06-2020

 బ్రేకింగ్: కేసీయార్ అనూహ్య నిర్ణయం.. GHMC పరిధిలో మళ్లీ లాక్ డౌన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ సీఎం కేసీయార్ అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నిత్యం వందలాది కేసులు నమోదవుతున్న గ్రేటర్ పరిధిలో మరోమారు లాక్ డౌన్ విధించే అవకాశాలు మెండుగా వున్నట్టు తెలుస్తోంది. తాజాగా తెలంగాణలో వెయ్యికేసులు దాటాయి. అందులో 888 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

దీంతో GHMC పరిధిలో మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశం వుందని తెలుస్తోంది. జూలై 1 నుంచి 15 రోజులపాటు లాక్ డౌన్ విధించే ఛాన్స్ వుందని అధికారుల ద్వారా తెలుస్తోంది. దీనిపై మరో రెండురోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు సీఎం కేసీఆర్. గతవారం రోజులుగా కరోనా టెస్టులు పెరగడంతో పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ లాక్ డౌన్ విధిస్తేనే పరిస్థితులు చక్కబడతాయని అంతా భావిస్తున్నారు. హైదరాబాద్‌లో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం. అవసరమైతే హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించనన్నుట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. 

హైదరాబాద్‌లో కరోనా వైరస్ నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఖరారు చేయనున్నట్టు చెప్పారు. జీహెచ్‌‌ఎంసీ పరిధిలో మరోసారి కొద్దిరోజుల పాటు లాక్‌డౌన్‌ విధించే ప్రతిపాదనపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. నగరంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అందరికీ వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని భరోసా ఇస్తూ వస్తున్నారు. కరోనా నియంత్రణ, చికిత్స, సంబంధిత అంశాలపై చర్చించేందుకు ఆదివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కర్యాదర్శి సోమేశ్‌కుమార్‌.. ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle