newssting
BITING NEWS :
తీవ్ర వివాదాల మధ్యనే పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు. ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసినా వెనక్కు తగ్గని కేంద్రం * రాజ్యసభలో కొనసాగుతున్న దుమారం. విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను హరివంశ్‌ తూట్లుపొడిచారాని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ విమర్శ * అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరపన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిలనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల కోసం మరోసారి ప్రయత్నాలు. శశికళ విడుదల కోసం అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ ఢిల్లీకి పయనం. సుప్రీం కోర్టు న్యాయవాదులు, న్యాయనిపుణులతో చర్చలు * ఆరు నెలల తర్వాత సోమవారం ఉదయం సందర్శకుల కోసం తెరుచుకున్న ఆగ్రాలోని అంతర్జాతీయ చారిత్రక పర్యాటక కేంద్రం తాజ్‌మహల్‌. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బారులు తీరిన సందర్శకులు. సోమవారం 160 మంది పర్యాటకులు ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు. రెండు షిఫ్తుల్లో రెండు వేలమందికి అనుమతులు * మహారాష్ట్రలోని భీవండి నగరంలో తీవ్ర విషాదం. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి పది మంది మృతి, మరో 20 మందికి గాయాలు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మర సహాయక చర్యలు * నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ. నేడు ధర్మాసనం ముందు లిస్ట్ అయిన 93 పిటిషన్‌లు విచారణ. ఆన్‌లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను విచారించనున్న ధర్మాసనం * నేటి నుండి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాల పునరుద్ధరణ. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా దర్శనాలు నిలిపివేయగా నేటి నుండి తిరిగి దర్శనాలు ప్రారంభం. సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో దర్శనం. పిల్లలకు, వృద్ధులకు ఆలయంలోకి నో ఎంట్రీ * భారీ వర్షాలతో పోటెత్తిన కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదులకు వరద. పలు గ్రామాలు ముంపునకు గురవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. పలు గ్రామాల్లో వరదలలో చిక్కుకున్న 48 మంది రైతులు, వ్యవసాయ కూలీలు, రక్షించిన ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు * కేంద్రం జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ ఉత్తర్వులు. నేటి నుంచి 50 శాతం మంది టీచర్లు బడులకు హాజరు. సోమవారం నుంచి విద్యార్థులు లేకుండానే కొనసాగనున్న పాఠశాలలు * ఈశాన్య బంగా‌ళా‌ఖాతంలో ఆది‌వారం ఉదయం ఏర్పడిన అల్ప‌పీ‌డనం. సోమ‌వారానికి మ‌రింత బలపడి అను‌బం‌ధంగా 3.1 కి.మీ. నుంచి 7.6 కి.‌మీ. ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.

బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో ఘటన

27-05-202027-05-2020 20:32:40 IST
Updated On 27-05-2020 20:33:36 ISTUpdated On 27-05-20202020-05-27T15:02:40.390Z27-05-2020 2020-05-27T15:02:29.208Z - 2020-05-27T15:03:36.044Z - 27-05-2020

బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో  ఘటన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బోరు బావులు తవ్వేవారి చిన్నపాటి నిర్లక్ష్యం.. యజమాని అలసత్వం మరోసారి ఓ బాలుడికి నరకం చూపిస్తోంది. ఏ పాపం ఎరుగని మూడేళ్ళ బాలుడు బోరుబావిలో పడిపోయాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్ చెన్ పల్లి గ్రామ శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు ఇలాఉన్నాయి. గ్రామానికి చెందిన మంగలి భిక్షపతి తన వ్యవసాయ క్షేత్రంలో బోరుబావి త్రవ్వడానికి పునుకోని మంగళవారం రాత్రి బోరుబావిని త్రవ్వగా బోరుబావి లో నీరు రాకపోవడంతో రాత్రి నిద్రించారు.

బుధవారం ఉదయం నుండి మళ్ళీ బోరు బావిని త్రవ్వగా రెండు బోరుబావులలొ నీరు రాకపోవడంతో బోరుబావుల త్రవ్వకాలను ఆపివేసి బోరుబావి గుంతలను పూడుస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న భిక్షపతి మనుమడు సంజయ్ సాయి వర్ధన్ మూడు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ బోరుబావి గుంతలో పడ్డాడు. ఇది గమనించిన కుటుంబీకులు వెంటనే బోరుబావి గుంతవద్ద కు వెళ్ళిచూడగా బాలుడి ఏడుపు వినిపించింది. 

ఈ సంఘటన జరిగిన తేరుకున్న భిక్షపతి వెంటనే పాపన్నపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యస్ ఐ ఆంజనేయులు, తహసీల్దార్ బలరాం లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బోరుబావి నుండి బాలుడిని తియ్యడానికి ఉన్నతాధికారులకు సమాచారం అందించగా మెదక్ ఆర్డీఓ సాయిరాం జేసీబీ,108 వాహనాన్ని రప్పించి గుంత నుండి బాలుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.  కాగా మంగళి భిక్షపతి కూతురి కొడుకు అయిన గోవర్ధన్ మూడు సంవత్సరాల బాబు, కాగా బాలుడికి మరో ఇద్దరు అన్నలు ఉన్నారు.

మరోవైపు బాబు సాయి వర్ధన్ ను రక్షించేందుకు సహాయక చర్యలు ప్రారంభించామని, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుంటాయన్నారు కలెక్టర్ ధర్మారెడ్డి. ఎన్డీఆర్ఎఫ్ బృందాల     సూచనలు, సలహాల మేరకే  రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందన్నారు మెదక్ కలెక్టర్ ధర్మా రెడ్డి. 

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

   4 hours ago


ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

   4 hours ago


స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

   4 hours ago


భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

   5 hours ago


బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

   7 hours ago


ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

   8 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?

కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?

   9 hours ago


ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

   9 hours ago


వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

   20-09-2020


కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

   20-09-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle