newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

బేషరతుగా విధుల్లోకి తీసుకోకుంటే సమ్మె విరమించం: జేఏసీ

25-11-201925-11-2019 08:50:30 IST
2019-11-25T03:20:30.433Z25-11-2019 2019-11-25T03:20:26.643Z - - 25-02-2020

బేషరతుగా విధుల్లోకి తీసుకోకుంటే సమ్మె విరమించం: జేఏసీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎలాంటి షరతులూ విధించకుండా తమను విధుల్లోకి తీసుకున్నట్లయితే తాము సమ్మెను విరమించడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 52వ రోజుకు చేరింది. ఆదివారం కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది. ఈ సమ్మెలో 9 డిపోల ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మె విరమిస్తామని చెప్పిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.

ఆర్టీసీ సంయుక్త కార్యాచరణ కమిటీ జేఏసీ కొద్ది రోజుల క్రితం చేసిన ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో సమ్మెను కొనసాగించడం తప్ప కార్మికులకు మరొక మార్గం లేదని టీఎస్సార్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నొక్కి చెప్పారు. 49 వేలమంది ఆర్టీసీ కార్మికులు ఇప్పటికీ సమ్మెలోనే ఉన్నారని, ప్రభుత్వం బేషరతుగా తమను విధుల్లోకి చేర్చుకోవనంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా తాను నిరసనప్రదర్శలు నిర్వహిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.

ఇటీవలే మేం మా ప్రధాన డిమాండ్ అయిన విలీనం డిమాండును వదులుకున్నాం. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకున్నట్లయితే సమ్మెను విరమిస్తామని కూడా ప్రతిపాదించాం. చర్చలు ప్రారంబించాలని కూడా చెప్పాం. కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేదు. ఇప్పటికీ మేం చర్చలకు సిద్ధంగా ఉన్నాం. బంతి ఇప్పుడు ప్రభుత్వ కోర్టులోనే ఉందని అశ్వత్థామరెడ్డి చెప్పారు.

ఆదివారం తెలంగాణ బస్సు డిపోల్లో మానవహారాలను నిర్వహించాం. రేపు అంటే సోమవారం బస్ స్టాండ్ల ముందు ఆర్టీసీ సిబ్బంది నిరసన ప్రదర్శనలు చేస్తాం అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ తెలిపారు.

అయితే ప్రభుత్వం వైపునుంచి ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాల విషయమై ఇంతవరకు ఎలాంటి ప్రతిస్పందనా లేకపోవడం గమనార్హం. 48 వేలకు పైగా బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్కులు తదితరులు 50 రోజులకు పైగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేకపోవడం తనను ధిక్కరించిన సిబ్బదితో తెగేదాకా తేల్చుకోవడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 

ఈ వారం కేసీఆర్ నిర్వహించే తదుపరి సమీక్షలో ఆర్టీసీ సిబ్బంది విషయం తేలిపోతుందని భావిస్తున్నారు. గత 50 రోజుల సమ్మె కాలంలో పాతిక మందికిపైగా ఆర్టీసీ కార్మికులు చనిపోవడం గమనార్హం. పైగా తెలంగాణ సమాజం ఆర్టీసీ సమ్మె గురించి కనీస స్పందన కూడా లేకపోవడం ప్రభుత్వం  మరింత బిగుసుకుపోవడానికి కారణం అవుతోంది.

ఉద్యమాల తెలంగాణాలో ఇకపై ఉద్యమాలు సాగిస్తే ఆర్టీసీ సిబ్బందికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించడం కేసీఆర్ ఉద్దేశంలా కనబడుతోందని విమర్శలు కూడా వస్తున్నాయి

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle