newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

బెత్తంతో రెండు దెబ్బలు వేస్తే రేపిస్టులు మారతారా? పవన్ వ్యాఖ్యలపై దుమారం

04-12-201904-12-2019 16:39:53 IST
Updated On 04-12-2019 17:09:16 ISTUpdated On 04-12-20192019-12-04T11:09:53.494Z04-12-2019 2019-12-04T11:09:50.556Z - 2019-12-04T11:39:16.917Z - 04-12-2019

బెత్తంతో రెండు దెబ్బలు వేస్తే రేపిస్టులు మారతారా? పవన్ వ్యాఖ్యలపై దుమారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డాక్టర్ దిశపై హత్యాచారం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేట్టున్నాయి. ఉరిశిక్ష విధింపు అమానవీయ ఘటన అంటూ వాదించే పౌర హక్కుల సంఘాల నేతలు కూడా డాక్టర్ దిశపై ముష్కరులు జరిపిన దారుణ మారణ కాండను చూసి తల్లడిల్లిపోయారు. కానీ పవన్ మాత్రం దిశ హంతకులకు కూడా ఉరిశిక్ష వేయవద్దు అంటూ అపరగాంధీలా ఫోజు కొట్టి మాట్లాడటం దుమారం లేపుతోంది.

రేపిస్టులను బహిరంగంగా ఉరి తీయాలంటూ జనం చేస్తున్న డిమాండ్‌ సరికాదని పవన్ తాజాగా చెప్పుకొచ్చారు. రేపిస్టులను బెత్తంతో రెండు దెబ్బలు చెమ్డాలు ఊడేలా కొట్టాలంటూ పవన్‌ వ్యాఖ్యలు చేశారు. ‘వైద్యురాలిపై హత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్‌ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారు. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి. అందరూ చూస్తుండగా కొట్టాలి’ అని పవన్‌ పేర్కొన్నారు. 

అత్యంత కిరాతకంగా, అమానుషంగా షాద్‌నగర్‌ శివార్లలో దిశను అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై ప్రజాగ్రహం పెల్లుబుక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిని ప్రపంచంలో మాయాభ్రమల్లో మునిగిపోయే హీరోలు ప్రత్యేకించి తెలుగు హీరోలు ఆ భ్రమల్లోంచి వాస్తవంలోకి ఎప్పుడూ రాలేరని, దిశ హత్యాచార నిందితుల్లాంటి వారికి ఉరి శిక్ష విధించకుండా రెండు బెత్తం దొబ్బలు బలంగా కొడితే సరిపోతుంది అని పవన్ ఆ భ్రమల్లో ఉండే వ్యాఖ్యానిస్తున్నారని మహిళలు దుయ్యబడుతున్నారు. 

భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న పవన్ కల్యాణ్ ఇలాంటి మాటలు కాక మరోలా ఎలా మాట్లాడతారని మహిళలు మండిపడుతున్నారు. నీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు పొరపాటున వాళ్లకు ఇలాగే జరిగితే అలా చేసిన వారిని కూడా పవన్ కల్యాణ్ రెండు దెబ్బలు వేసి సరిపెట్టుకుంటారా అంటూ ఏపీలో మహిళలు ప్రశ్నిస్తున్నారు. చెల్లెలి వరస అయిన అమ్మాయి ప్రేమించి వివాహం చేసుకుంటే తనను తీసుకెళ్లిపోయిన వాడిని పిస్టల్‌తో కాల్చి చంపుతానని గతంలో పవన్ కల్యాణ్  అన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి గదా.. అలాంటి పవన్ ఇప్పుడు డాక్టర్ దిశ హంతకుల పట్ల ఇంత పక్షపాతం చూపడం దేనికని నిగ్గదీశారు.

దిశ ఘటనపై  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి మేకతోటి సుచరిత తప్పుబట్టారు. పవన్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని రెండు దెబ్బలు వస్తే  నేరాలు కంట్రోల్‌ అవుతాయా అని ప్రశ్నించారు. ప్రజా నాయకుడిని అని చెప్పుకునే పవన్‌.. ఇలాగేనా మాట్లాడేదని  మండిపడ్డారు. మహిళలంటే పవన్‌కు ఎంత చులకనో ఆయన వ్యాఖ్యలు బట్టే అర్థమవుతుందని విమర్శించారు. పవన్‌ లాంటి వారు ఎప్పడైనా అధికారంలోకి వస్తే మహిళలకు ఏం రక్షణ ఉంటుందని నిలదీశారు. 

కాగా, దేశాన్ని కుదిపేసిన దిశ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మరిన్ని నేరాలను పురిగొల్పేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెటర్నరీ డాక్టర్‌ దిశను దారుణంగా అత్యాచారం చేసి చంపిన నిందితులను వెనకేసుకొని రావటం ఆయన నిజస్వరూపానికి అద్దం పడుతోందని అనంతపురంలోని స్థానిక మహిళలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సినీ గ్లామర్ ఉంది కదా అని ప్రజలచేత చప్పట్లు కొట్టించుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పితే పవన్ కల్యాణ్‌లో కనీస సామాజిక స్పృహ కూడా లేదని దుయ్యబట్టారు.

మరోవైపున విజయవాడ నగరంలో జస్టిస్‌ ఫర్‌ దిశ నిరసనలు మిన్నంటాయి. దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎయిర్‌ కండిషన్‌ అండ్‌ రిఫ్రిజిరేషన్‌ టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. లబ్బీపేట నుంచి సన్నబట్టిల సెంటర్‌ వరకు ర్యాలీ కొనసాగించారు. అనంతరం వారు మాట్లాడుతూ వెంటనే ఫాస్ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి దిశ కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపైనా అభ్యంతరం తెలిపారు. బెత్తం దెబ్బలు కొడితే మారిపోవడానికి వారు చిన్నపిల్లలు కాదని మానవ మృగాలని పేర్కొన్నారు. అరబ్‌ దేశాల్లోని కఠిన చట్టాలను మనదేశంలోనూ అమలు చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   5 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle