newssting
BITING NEWS :
* సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సుదీర్ఘ చర్చలు. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల రాత్రి 9 గంటల వరకు ఆరవ విడత చర్చలు. * మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు, మహిళలు అధికం. * బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకు సమాజ్‌వాదీ పార్టీ మద్ధతు. సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా సోమవారం రాత్రి ప్రకటన. * ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు. ముంబై, థానే, రాయగడ్, పూణే, సతార, సిందూర్గ్ ప్రాంతాల్లో మంగళవారం ఉరుముులు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై వాతావరణ శాఖ హెచ్చరికలు. రష్యా దేశంలో భారీ భూకంపం. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యన్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడి. భూకపంపంతో ప్రజలు భయాందోళనలు. విగత జీవిగా దొరికిన సరూర్ నగర్ తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్‌. * కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య సాగుతున్న విమర్శ, ప్రతి విమర్శలు. * కేంద్ర బిల్లులతో రైతులకు మేలని బీజేపీ వర్గాలు, కొత్తగా తెచ్చిన బిల్లులతో రైతులను తీవ్ర నష్టమని టీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు. 280వ రోజుకు చేరుకున్న రాజధాని అమరావతి రైతుల ఉద్యమం. కొనసాగుతున్న శిబిరాల్లో రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ జరిగే అవకాశం. బుధవారం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నా మంగళవారం ఆకస్మిక ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలతో చర్చకు అవకాశం. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం.

బీ అలర్ట్.. మేలో ఠారెత్తించే ఎండలు.. ఉక్కపోత!

24-04-202024-04-2020 16:12:56 IST
Updated On 24-04-2020 16:16:02 ISTUpdated On 24-04-20202020-04-24T10:42:56.572Z24-04-2020 2020-04-24T10:42:51.539Z - 2020-04-24T10:46:02.010Z - 24-04-2020

బీ అలర్ట్.. మేలో ఠారెత్తించే ఎండలు.. ఉక్కపోత!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకపక్క దేశమంతా కరోనా మహమ్మారితో అల్లాడిపోతోంది. దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఉరుకులు పరుగులు పెడుతుంటే ప్రజలు ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని బ్రతుకీడుస్తున్నారు. కరోనా సృష్టిస్తున్న విలయతాండవాన్ని ఏ పోలికతో చెప్పలేము. ఇది చాలదన్నట్లు ఇప్పుడు మే నెలలో ప్రకృతి ప్రకోపం చూపించనుందని.. గతంలో ఎన్నడూ చూడని ఉష్ణోగ్రతలు ఇప్పుడు రానున్నాయని ఐఎండీ తాజా హెచ్చరిక.

ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతవరణ శాఖ తాజాగా హెచ్చరించింది. మే మొదటి వారం నుండి మొదలయ్యే ఈ ఎండలు నెల మొత్తం కొనసాగనున్నాయని తెలిపింది. అది కూడా 32 నుండి 45 డిగ్రీల వరకు ఈ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రజలకు పిడుగులాంటి వార్త వెల్లడించింది.

మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో కాస్త ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుంటాయి. వేడి గాలులు అసలు చాలా తక్కువనే చెప్పుకోవాలి. కానీ ఈ సారి మే నెలలో మాత్రం ఏపీని మించి తెలంగాణలో వేడి గాలులు వీయనున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు కూడా ఎన్నడూలేని విధంగా రెండు రాష్ట్రాలలో నమోదు కానున్నాయట.

హైదరాబాద్‌లో ఏప్రిల్ 30, 1973న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటి వరకు హైదరాబాద్ చరిత్రలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఆ రికార్డు మే నెలలో బ్రేక్ కాబోతుందని అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. ఇక వచ్చే నెలలో ఇది 45 డిగ్రీలకు చేరువ కానుందని చెప్తున్నారు.

ఇక ఏపీలో కూడా తీవ్రమైన వడ గాలులు వీయనున్నాయని.. ప్రజలు ఇళ్ల నుండి అడుగుపెట్టడం కూడా కష్టమవుతుందని చెప్పారు. ఇక ఉక్కపోత కూడా రికార్డు స్థాయిలో ఉండనుందని అంచనా వేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. కేంద్రం ఇప్పటికే మే 3 వరకు లాక్ డౌన్ విధించగా.. తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకు కొనసాగించనున్నారు.

అయితే.. ఈ ఉష్ణోగ్రతలను బట్టి ప్రజలు మరో వారం కూడా ఇళ్ల నుండి బయటకి వచ్చే పరిస్థితి ఉండదని చెప్తున్నారు. ఒకవిధంగా ఇది ప్రజలకు మేలు చేసే అవకాశమే ఉందని కొందరంటుంటే.. ఈ ఉష్ణోగ్రతల ప్రభావంతో వృద్దులు.. పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందంటున్నారు. సాధారణంగా 40 డిగ్రీల ఎండను మించి మనిషి శరీరం తట్టుకోలేదు.

ఆ పైన నమోదయ్యే ప్రతి డిగ్రీ ప్రజలను ఇబ్బందులలోకి నెట్టినట్లే. అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు అధిక ఉష్ణోగ్రతలలో కరోనా వైరస్ కొంతమేర వృద్ధికి బ్రేక్ పడుతుందని వెల్లడిస్తున్నారు. వైరస్ పూర్తిగా నశించదు కానీ కొంతవ్యాప్తికి మాత్రం ఆటంకంగా మారుతుందని చెప్తున్నారు. అంటే ఒక విధంగా అధిక ఉష్ణోగ్రతలు మేలు చేయనున్నా.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మరో ఉపద్రవంగా మారే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle