newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బీజేపీ మాటల దాడి.. కరోనా ఖర్చెంత?

22-07-202022-07-2020 08:35:05 IST
Updated On 22-07-2020 12:04:27 ISTUpdated On 22-07-20202020-07-22T03:05:05.762Z22-07-2020 2020-07-22T03:03:20.776Z - 2020-07-22T06:34:27.688Z - 22-07-2020

బీజేపీ మాటల దాడి.. కరోనా ఖర్చెంత?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో బీజేపీ మరింత పాతుకుపోవడానికి ప్రయత్నిస్తూనే వుంది. అందిన అవకాశాన్ని వినియోగించుకుంటూనే వుంది. తరచూ ఆందోళనలు, నిరసనలు చేస్తూ ప్రభుత్వంపై వత్తిడి చేస్తోంది. తాజాగా కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడం, టెస్టులు తగ్గిపోవడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా పని చేస్తున్నారు. 

అవకాశం వస్తే చాలు కెసిఆర్ ప్రభుత్వం పై దూకుడు ప్రదర్శిస్తున్నారు బండి సంజయ్. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు ఎక్కువగా తీసుకుపోతున్నారు. సీఎం కెసిఆర్ కు బండి సంజయ్ లేఖ రాశారు. కరోనా వైరస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేశారో చెప్పాలని లేఖలో ప్రస్తావించారు. కరోనా నివారణకు అవసరమైతే రూ.1000 కోట్లు ఖర్చు చేస్తానని అసెంబ్లీలో ప్రకటించిన మీరు ప్రధానికి మాత్రం 100కోట్లు ఖర్చు అయినట్లు చెప్పటం ద్వంద్వ వైఖరి కాదా అంటూ ప్రశ్నించారు. 

కరోనా వేళ సీఎం సహాయనిధికి వచ్చిన విరాళాలను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందని, విరాళాలను ఎందుకు బయటపెట్టరని ఆయన ప్రశ్నించారు. కరోనా నియంత్రణ విషయంలో ఇప్పటికైనా విపక్షాల సలహాలను తీసుకోవాలని సూచించారు.  రాష్ట్ర ప్రజలు ప్రాణాలు రక్షించడం తక్షణ అవసరం. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో విశ్వాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఒకవైపు స్వయాన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కరోనా కట్టడిలో ప్రభుత్వ పనితీరును అధికారుల నిర్లక్ష్యాన్ని, ఆస్సత్రుల్లో కల్పిస్తున్న సౌకర్యాల విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచింది. 

న్యాయస్థానమే ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాలని కోరే పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందంటే పరిస్థితులను ఏవిధంగా అర్థం చేసుకోవాలి. ఈ క్లిష్ట సమయంలో కోవిడ్‌ విషయంలో మీరు ప్రధానితో వాస్తవపరిస్థితిని తెలిపారో లేదోనని సందేహంగా ఉంది. దయచేసి నిజాలను దాచి తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకండి. ఈ సమయంలో రాజకీయాలకు తావులేకుండా కలిసి కట్టుగా కోవిడ్‌పై పోరాటం చేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలని కాపాడాలని' లేఖలో పేర్కొన్నారు.

అటు హైదరాబాద్ లో కరోనా ఉధృతిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్న వివిధ ఆసుపత్రులను సందర్శించి, ఈ మహమ్మారిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు, ఇంకా కోవిడ్ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. హైదరాబాద్ డేంజర్ జోన్ లో వుందని అంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల్లో వచ్చిన నిధులపైనా, ప్రభుత్వం చేసిన ఖర్చులపైనా వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి బండి సంజయ్ లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. 

Image

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   an hour ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle