బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం
06-04-202006-04-2020 11:20:40 IST
Updated On 06-04-2020 11:52:45 ISTUpdated On 06-04-20202020-04-06T05:50:40.038Z06-04-2020 2020-04-06T05:50:37.766Z - 2020-04-06T06:22:45.261Z - 06-04-2020

దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో ఎందరో జీవితాలు తల్లక్రిందులయ్యాయి. ముఖ్యంగా పెదాలు, రోజువారీ కూలీలు, వలస కార్మికుల జీవితాలు రోడ్డునపడ్డాయి. ప్రభుత్వాలు వారిని ఆదుకుంటామని చెప్తున్నా.. వారి కోసం కొన్ని చర్యలు చేపడుతున్నా పూర్తిగా ఆదుకోవడమే సవాల్ గానే మారుతుంది. ఈక్రమంలోనే స్వయం సేవక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు.. కొందరు ఉదార స్వభావులు పేదలకు ఆహార కొరతను తీరుస్తున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ బీజేపీ ఓ వినూత్న ప్రకటన ఇచ్చింది. సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి కార్యకర్త తమ ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలని తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. దీంతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టనున్న కార్యక్రమాలను ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఇందులో లాక్డౌన్ కారణంగా కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలకు సంఘీభావంగా కార్యకర్తలందరూ ఒకరోజు భోజనం మానుకోవాలని కోరింది. అందుకు బదులుగా ప్రతి కార్యకర్త లాక్ డౌన్ కారణంగా కష్టాలను ఎదుర్కొంటూ.. తిండికి కూడా ఇబ్బందులు పడుతున్న పేదలకు మరో ఐదుగురికి తగ్గకుండా ఆహారాన్ని అందించాలని పార్టీ ప్రకటన ద్వారా కోరారు. ప్రస్తుతమున్న కష్టకాలంలో ఒకవిధంగా బీజేపీ మంచి నిర్ణయమే తీసుకుందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నిత్యావసరాల సరుకుల పంపిణీ చేపట్టగా ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా కొన్ని వాహనాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు, జిల్లా కమిటీలు కూడా సేవా కార్యక్రమాలను విరివిగా చేపడుతున్నారు. ఇక ఈరోజు పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఆడంబరాలకు పోకుండా .. పేదలకు ఉపయోగపడేలా ఒక కార్యకర్త మరో ఐదుగురికి ఆహారం అందించాలని పిలుపు నివ్వడం విశేషంగా చెప్పుకోవాలి. తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఎవరికి తోచినంతగా వారు ప్రజలను ఆదుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార-ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అందరూ ప్రజల మధ్యకి వచ్చి అండగా నిలబడుతున్నారు. ఇప్ప్పటికే ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకి వెళ్లి అవగాహన కల్పిస్తూ వారి అవసరాలను తెలుసుకొని ప్రజలతో మమేకమవుతున్నారు. మరోవైపు పూర్తిగా రాజకీయాలను పక్కకుపెట్టి వీలైనంత వరకు కరోనాను ఎదుర్కొనే దిశగా ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రభుత్వానికి పూర్తిగా సహకరిచేందుకు కూడా సిద్ధమని ప్రకటించేసింది. దక్షిణది రాష్ట్రాలలో ఒక్క తెలంగాణలోనే పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలను మరచి ప్రజలకు అండగా కనిపిస్తున్నాయి. అధికార-ప్రతిపక్షాల మధ్య రాజకీయ కారణాలు ఉన్నా అందుకు ప్రజలను బాధ్యులు చేయకపోవడం లేదా ప్రజలను బలిచేయకపోవడం మంచి పరిణామంగా చెప్పుకోవాలి. పైగా కరోనా అనే మహమ్మారిని తరిమికొట్టే ఈ యుద్ధంలో ఒకరికి మరొకరు అండగా ఉంటేనే అర్ధం!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
an hour ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
3 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
4 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
5 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
6 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
7 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
5 hours ago

నా రూటే సెపరేటు
9 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా