newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

బీజేపీ ఛాన్స్‌ మిస్‌చేసుకుందా?

29-11-201929-11-2019 09:31:41 IST
Updated On 29-11-2019 16:39:00 ISTUpdated On 29-11-20192019-11-29T04:01:41.378Z29-11-2019 2019-11-29T04:01:38.443Z - 2019-11-29T11:09:00.396Z - 29-11-2019

బీజేపీ ఛాన్స్‌ మిస్‌చేసుకుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాలపై గురిపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా తమ బలాన్ని పెంచుకోవాలని ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణపై ఆపార్టీ నేతలు పక్కావ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. దీనికితోడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆపార్టీకి బలమైన పట్టు ఉంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎంపీ ఎన్నికలు పూర్తయిన నాటినుంచి తెలంగాణలో పార్టీ బలోపేతానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బీజేపీ అధిష్టానం ముందుకు సాగుతుంది. దీనికితోడు ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తూ బలమైన పార్టీగా అవతరించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అవకాశం వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్‌ పై, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆ పార్టీ నేతలు విమర్శలను ఎక్కు పెడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో అమలు కాకుండా కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేతలు విస్తృత ప్రచారం చేశారు. దీనికితోడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టే పథకాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ ఆ పార్టీనేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. దీనికితోడు ఆర్టీసీ కార్మికుల సమ్మె రూపంలో బీజేపీ అవకాశం లభించినట్లయింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు.

దసరా పండుగకు రెండురోజుల ముందు సమ్మెలోకి వెళ్లినప్పటికీ సీఎం కేసీఆర్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవ తీసుకోలేదు. దీనికితోడు కార్మికులను సెల్ప్‌ డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష పార్టీలన్నీ తెరాస ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఇదే అవకాశాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నాలు చేసింది. కార్మికుల పక్షాన తెలంగాణ బీజేపీ నిలిచింది. సీఎం కేసీఆర్‌ మెడలు వంచేలా కేంద్రం రంగంలోకి దిగుతుందని కార్మికులను ఊరించారు.

కేసీఆర్‌ తీరుకు నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. పలు దఫాలుగా విచారణ జరిపిన హైకోర్టుసైతం ప్రభుత్వానికి మేమేం చెప్పలేమని చేతులెత్తేసింది. ఈ తరుణంలోనూ కేంద్రానికి ఆర్టీసీలో 30శాతం వాటా ఉందని, కేంద్రం రంగంలోకి దిగుతుందని, అమిత్‌షా ఈ సమస్యపై దృష్టిసారించారని, త్వరలోనే కేసీఆర్‌ మెడలు వంచి కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తారని పలువురు బీజేపీ నేతలు ఊదరగొట్టారు.

హైకోర్టులు చేతులెత్తేసినా.. బీజేపీ న్యాయం చేస్తుందని కార్మికులంతా ఎదురుచూశారు. అయినా బీజేపీ మాటలకే పరిమితం అయిందే తప్ప సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం అమిత్‌షా, గడ్కరీకి వినతిపత్రాలు ఇవ్వటంతోనే బీజేపీ రాష్ట్ర పెద్దలు సరిపెట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేఖతతో ఉన్న కార్మికులతో పాటు సీఎం కేసీఆర్‌పై వ్యతిరేఖతతో ఉన్న ప్రజలుసైతం బీజేపీ ఆర్టీసీ సమస్యను పరిష్కరిస్తుందని, ఇక రాబోయే కాలం బీజేపీదేనని భావించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా మారుతుందని, బీజేపీ వైపు ఉంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఓ నిర్ణయానికిసైతం వచ్చారు.

కానీ బీజేపీ పెద్దలుసైతం మాటలకే పరిమితం కావటంతో అటు కార్మికులు, ఇటు ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. దీంతో కార్మికులు చేసేందేమీలేక బేషరతుగా విధుల్లో చేరుతామని ప్రకటించారు. అయినా

కేసీఆర్‌ విధుల్లోకి తీసుకోమని పేర్కొనడంతో సేవ్‌ ఆర్టీసీ పేరుతో కార్మికులు మూడు రోజులు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలోనూ కేంద్ర పెద్దలు రంగంలోకి దిగి కార్మికుల సమస్యను పరిష్కరించి ఉంటే రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం అయ్యేదని, వచ్చిన అవకాశాన్ని చేజేతులా వదులుకున్నట్లయిందని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 55రోజులు పాటు కార్మికులను రోడ్డున పడేసిన కేసీఆర్‌.. విధుల్లో చేరండి అనే ఒక్కమాటతో మళ్లీ కార్మికుల మనస్సులను గెలుచుకున్నాడని, అదే మధ్యలోనే బీజేపీ రంగంలోకి దిగే ఆ క్రెడిట్‌ మొత్తం బీజేపీకి వచ్చేదని పార్టీలోని పలువురి నేతలు వాపోతున్నారు.

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   an hour ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   4 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   6 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   7 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   8 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle