newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరింత భద్రత

29-08-202029-08-2020 17:43:10 IST
Updated On 29-08-2020 20:30:37 ISTUpdated On 29-08-20202020-08-29T12:13:10.787Z29-08-2020 2020-08-29T12:11:55.647Z - 2020-08-29T15:00:37.158Z - 29-08-2020

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరింత భద్రత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ అసెంబ్లీ లో ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. మనిషి ఒక్కడే కానీ ఆయన చుట్టూ వివాదాలే. ఆయన నిత్యం వార్తల్లో వుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. హిందూత్వానికి ఆయన కేరాఫ్ అడ్రస్. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు భద్రతను పెంచారు. ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉన్నట్లు సమాచారం. దీంతో  తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజాసింగ్ ఇంటి వద్ద  భద్రతకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. 

ఎమ్మెల్యేను బైక్‌పై తిరగవద్దని సీపీ సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన బులెట్ ప్రూఫ్ కార్‌లోనే వెళ్లాలని తెలిపారు. డీసీపీ స్థాయి అధికారితో  రాజసింగ్ భద్రతా పర్యవేక్షణకు చర్యలు చేపట్టారు.రాజాసింగ్ ఇంటి వద్ద నూతన ఆయుధాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అంతేకాదు ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు సూచనలు చేశారు పోలీసులు. 

ప్రభుత్వం ఇచ్చిన బులెట్ ప్రూఫ్ కార్‌లోనే వెళ్లాలని పోలీసులు కోరారు.  డీసీపీ స్థాయి అధికారితో రాజసింగ్ భద్రతా పర్యవేక్షణకు చర్యలు చేపట్టారు. డిసిపి స్థాయి అధికారి ఆధ్వర్యంలో రాజా సింగ్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే రాజా సింగ్ తన భద్రతను పెంచడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తన గన్ మెన్ గన్స్ కూడా మార్చారని రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేసారు. ఎవరి నుండి తన ప్రాణాలకు ముప్పు ఉందొ చెప్పాలని కోరుతున్నానన్నారు. టెర్రరిస్టుల నుండి ఉందా , లేదా స్థానికంగా ఉండే ఏదైనా సంస్థల నుండి ఉందో స్పష్టం చేయాలని కోరారు. రాష్ట్ర హోం మంత్రికి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన లేఖలు రాస్తున్నట్టు వెల్లడించారు.

అప్పుడప్పుడూ రాజాసింగ్ బీజేపీలోనే ఫైర్ బ్రాండ్ గా వుంటారు. ఈ మధ్యకాలంలో పలు విషయాల్లో తెలంగాణ ప్రభుత్వంపైన, టీఆర్ఎస్ నేతలపైన ఆయన విమర్శలు చేశారు. అలాంటి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాణాలకే ముప్పు ఉందని పోలీసులే హెచ్చరించడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   8 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   15 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   13 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle