బీజేపీ ఎంపీ సంచలనం.. ఓవైసీని ఉల్టా వేళ్ళాడదీసి గడ్డం కోస్తానని వార్నింగ్
04-01-202004-01-2020 09:33:47 IST
Updated On 04-01-2020 12:25:51 ISTUpdated On 04-01-20202020-01-04T04:03:47.469Z04-01-2020 2020-01-04T04:03:42.186Z - 2020-01-04T06:55:51.264Z - 04-01-2020

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందో లేదో ఇక్కడ రాజకీయ పార్టీలు మాటల దాడిని మొదలుపెట్టాయి. అధికార ప్రతిపక్షాలు దూకుడుపెంచి ప్రజలు, సభలతో బిజీ అయిపోయాయి. అధికార తెరాస పార్టీలో ప్రతి మంత్రి, ఎమ్మెల్యే పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా నిత్యం ప్రజల మధ్యనే ఉంటుండగా కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా మీడియా సమావేశాలు, ప్రభుత్వంపై విమర్శలతో చురకలేస్తున్నాయి. ఇక బీజేపీ.. ఎంఐఎం అయితే ప్రతి ఎన్నికల సమయంలో లాగానే ఈ ఎన్నికలకు కూడా హీట్ పెంచే చర్యలకు దిగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన సిఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ నిజామాబాద్ లో భారీ సభ ఏర్పాటు చేసి కేంద్రం తీసుకొచ్చిన చట్టం, బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఒక విధంగా ముస్లిం మైనారిటీలలో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే ఈ సభ ఉద్దేశ్యంగా కనిపించింది. హైదరాబాద్ కు ఏ మాత్రం సంబంధం లేని నిజామాబాద్ లో అది కూడా బీజేపీ ఎంపీ సభ పరిధిలో సభ పెట్టడం అందుకు తెరాస ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇవ్వడంపై బీజేపీ అప్పుడే తీవ్రంగా మండిపడింది. ఇక ఎంఐఎం సభతో దూకుడు పెంచిన బీజేపీ కూడా అదే నిజామాబాద్ లో తాజాగా ఇందూర్ ప్రజాప్రదర్శన పేరుతో భారీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభ నుండి తెలంగాణ బీజేపీ నేతలు ఎంఐఎంపై తీవ్రవ్యాఖ్యలు చేసారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, సీఎం కేసీఆర్ లపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసిఆర్ గడ్డం లేని ముల్లా అయితే అయనకు అసదుద్దీన్ పెద్ద కొడుకు అన్నారు. ఎంపీ అరవింద్ మజ్లీస్ నేతలను ఏకవచనంతో సంబోధిస్తూనే వ్యక్తిగత దూషణలకు దిగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసదుద్దీన్ ను భారీ క్రేన్ కు వేలాడదీసి గడ్డం కోస్తామని హెచ్చరించిన అరవింద్ ఆ గడ్డం ఊరికే పోకుండా గడ్డం లేని ముల్లా సీఎం కెసిఆర్ కు గడ్డాన్ని అతికిస్తామన్నారు. సీఎం కెసిఆర్ బీజేపీ దెబ్బకు అయన బిడ్డ కవితనే బలైదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్న ఎంపీ అయన కొడుకు కేటీఆర్ నాస్తికుడని విమర్శించారు. ఇక అయన పెద్దకొడుకు అసదుద్దీన్ హైదరాబాద్ లో చించలేక ఇక్కడని వచ్చి చించుతామని ఎగిరాడడన్నారు. అక్కడితో ఆగని అరవింద్.. హైదరాబాద్ నీ ఇలాకాలోనే మహమ్మద్ పహిల్వాన్ అనేటోడి నీ తమ్ముడిని యాభై సార్లు పొడిస్తేనే నువ్వేం చేయలేకపోయినవ్.. ఇక్కడకి వచ్చి ఏమిచేస్తావ్?.. చిరిగిన దాన్ని అంటిబెట్టుకోడానికి ఆడు తొమ్మిదేళ్ల నుండి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతండు.. సొంత తమ్ముడిని కాపాడుకోలేని నీవు బీజేపీని చింపుతావా? నీ మొఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలపై మజ్లీస్ నేతల స్పందన ఎలా ఉన్నా మున్సిపల్ ఎన్నికలకు వేడి మాత్రం మొదలయిందని చెప్పుకోవచ్చు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
14 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
10 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
12 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
17 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
19 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
20 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా