newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

బీజేపీ ఎంపీ బండి సంజయ్ మిస్సింగ్ కలకలం!

24-01-202024-01-2020 10:23:25 IST
Updated On 24-01-2020 11:18:18 ISTUpdated On 24-01-20202020-01-24T04:53:25.637Z24-01-2020 2020-01-24T04:53:17.587Z - 2020-01-24T05:48:18.443Z - 24-01-2020

బీజేపీ ఎంపీ బండి సంజయ్ మిస్సింగ్ కలకలం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మిస్సింగ్ అయ్యారంటూ ఓ వార్త గురువారం నుండి కలకలం రేపుతోంది. సహజంగానే టీఆర్ఎస్ పార్టీపై దూకుడుగా వెళ్లే ఎంపీ సంజయ్ మున్సిపల్ ఎన్నికలలో ఇంకాస్త దూకుడు పెంచారు. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఎన్నికలలో గట్టి ప్రచారం చేశారు. ముఖ్యంగా ఎంఐఎం.. టీఆర్ఎస్ పార్టీ దోస్తీ అంటూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.

కాగా, ఈ ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఎంపీ సంజయ్ పై రాళ్ల దాడి జరిగిందని బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. రాళ్ల దాడిపై స్పందించిన పోలీసులు అయనను ప్రత్యేక భద్రతను కూడా నియమించారు. అయితే కరీంనగర్ సీపీ కమలహాసన్ రెడ్డి ఎంపీపై రాళ్ల దాడిపై స్పందిస్తూ దాడిని కొట్టిపారేశారు. దీంతో సీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.

ఈక్రమంలోనే జిల్లా బీజేపీ నేతలు సీపీపై తీవ్రం వ్యాఖ్యలు చేశారు. సీపీ కమలహాసన్ రెడ్డి ఓ అధికారిగా కాకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలలో కూడా జిల్లా స్థాయిలో సీపీ అధికార పార్టీకి కొమ్ముకాశారని తీవ్ర విమర్శలు చేశారు. కాగా, అదే క్రమంలో బుధవారం తనకి నియమించిన భద్రతను కూడా ఉపసంహరించుకోవాలని ఎంపీ సంజయ్ కోరారు.

సీపీ రాళ్లదాడి జరగలేదని చెప్పడంపై మండిపడుతూ సంజయ్ దాడి జరగకపోతే భద్రత ఎందుకు నియమించారని ప్రశ్నించారు. బుధవారం సీపీ-ఎంపీ సంజయ్ మధ్య వార్ నడుస్తుండగానే గురువారం ఉదయం నుండి ఎంపీ సంజయ్ కనిపించకుండా పోయారని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ అఫ్ వస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ఉదయం ఎంపీ కుటుంబ సభ్యులు ఇంటి వద్ద ఉన్న పోలీసులను బందోబస్తు నుండి వెళ్లిపోవాలని సూచించారు. కానీ పోలీసులు వెళ్లిపోవాలని కోరుతూ రాతపూర్వకంగా ఇవ్వాలని అడగటంతో వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తుంది. తాము సెక్యూరిటీ కోసం రాతపూర్వకంగా కోరామా? ఇప్పుడు వద్దని రాసివ్వడానికి అంటూ కుటుంబ సభ్యులు పోలీసులపై మండిపడ్డారని చెప్తున్నారు.

కాగా, ఈ ఉదయం నుండి ఎంపీ సంజయ్ కనపించడం లేదన్న వార్తతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో సంజయ్ మిస్సింగ్ అంటూ పార్టీ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి సంజయ్ ఎక్కడ ఉన్నారు? ఆచూకీ చెప్పకుండా ఎందుకు వెళ్లినట్లు? దీని వెనుక బలమైన కారణాలు ఏంటన్నదానిపై పార్టీ వర్గాలు కూపీ లాగుతున్నాయి.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   5 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle