newssting
BITING NEWS :
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో గురువారం ఉదయం సంభవించిన భూకంపం. పాకిస్థాన్ దేశంలోని ఇస్లామాబాద్ నగరానికి పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో ఉదయం 5.46 గంటలకు భూ ప్రకంపనలు. భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.3 అని సీస్మోలజీ శాస్త్రవేత్తల ప్రకటన. ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని కాబూల్ నగరానికి ఈశాన్యంలోని 237 కిలోమీటర్ల దూరంలో ఉదయం 5.33 గంటలకు భూకంపం. రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదు * గుజరాత్‌లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం. సూరత్‌లోని హజీరా ఆధారిత ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్లాంట్‌లో తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రమాదం. ఓఎన్‌జీసీ ప్లాంట్‌లోని రెండు టెర్మినల్స్ వద్ద పేలుడుతో భారీ ఎత్తున చెలరేగిన మంటలు * ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో 12 వేల పందులను మట్టుబెట్టాలని అసోం ప్రభుత్వం ఆదేశం. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూను అరికట్టే చర్యల్లో భాగంగా నిర్ణయం. పందులను చంపేందుకు యజమానులకు పరిహారం. రాష్టంలోని 14 జిల్లాలలో స్వైన్ ఫ్లూ ప్రభావం,స్వైన్ ప్లూ కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 వేలకు పైగా పశువులు మృతి * ముంబైలో మరోసారి రికార్డు స్థాయిలో వర్షాలు. సెప్టెంబర్‌ నెలలో ఇంతటి స్థాయిలో వర్షాలు కురవడం గత 26 ఏళ్లలో ఇది నాల్గోసారి. మంగళవారం, బుధవారం 24 గంటలలో ఏకంగా 286.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. 1994 తర్వాత సెప్టెంబర్‌ నెలలో కురిసిన భారీ వర్షమిదే. 1974 నుంచి 2020 కాలంలో సెప్టెంబర్‌లో ఇంత భారీ వర్షం నమోదు కావడం ఇది నాల్గోసారి * ఢిల్లీలో కరోనా వైరస్ మరోసారి విజృంభణ. కరోనా బాధితులలో 11.55 శాతం మంది వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స. కొద్దిరోజులుగా అంతకంతకూ పెరుగుతున్న ఢిల్లీలో వెంటిలేటర్‌పై ఉంటున్న రోగుల సంఖ్య. ఢిల్లీలో స్థానిక కోవిడ్ బాధితుల కోసం రిజర్వ్ చేసిన 62 శాతం వెంటిలేటర్ బెడ్లు ఫుల్ * కరోనాతో మృతి చెందిన కర్ణాటక బీజేపీ ఎంపీ, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి(65). మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రి ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సురేష్ అంగడి. కరోనా వల్ల చనిపోయిన తొలి కేంద్ర మంత్రి ఈయనే * భద్రాద్రి కొత్తగూడెం చెన్నాపురం అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు. ముగ్గురు మావోయిస్టుల మృతి చెందగా అందులో ఇద్దరు మహిళలు. అయితే కాల్పులు జరిగిన ప్రదేశం నుండి రైఫిల్, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్న పోలీసులు. మరికొంత మంది మావోయిస్టుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు * హైదరాబాద్ నగర శివారులో రోడ్డెక్కిన సిటీ బస్సులు. రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం. ప్రతి డిపో నుంచి 12 బస్సులను నడుపుతున్న ఆర్టీసీ * కరోనాకు మరో ప్రముఖ నటుడు బలి. తెలుగు కమెడియన్ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనా కారణంగా కన్నుమూత. గత 22 రోజులుగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి. కరోనా నెగిటివ్ వచ్చాక కూడా అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయిన కమెడియన్ * శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. జలాశయం 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల * చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఏనుగులు బీభత్సం. పంట పొలాలకు కాపలాగా ఉన్న వారిపై ఏనుగులు దాడి. ఒకరు మృతి చెందగా మరికొందరికి గాయాలు. ఏనుగుల బీభత్సంతో భయాందోళనలు వ్యక్తం చేసున్న గ్రామస్థులు * పశ్చిమ మధ్యప్రదేశ్‌ పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తున ఆవరించిన ఉపరితల ఆవర్తనం. గురు, శుక్రవారాలలో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

బీజేపీలో పెరిగిన పోటీ.. కొత్త రథసారథి ఎవరో?

01-11-201901-11-2019 15:07:21 IST
Updated On 01-11-2019 17:45:52 ISTUpdated On 01-11-20192019-11-01T09:37:21.317Z01-11-2019 2019-11-01T09:37:19.345Z - 2019-11-01T12:15:52.896Z - 01-11-2019

బీజేపీలో పెరిగిన పోటీ.. కొత్త రథసారథి ఎవరో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇన్నాళ్లు ఒకరిద్దరు పేరొందిన నేతలు ఉన్న బీజేపీలో పెద్దగా వర్గ విభేదాలకు ఆస్కారం లేకుండా సజావుగా నడిచేంది. కేంద్రంలో రెండవ సారి పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో పదవుల కోసంపోటీ పెరిగింది. దీనికితోడు ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీల నుంచి వలసలు పెరిగాయి. ఇరు పార్టీల నుంచి కీలక నేతలు బీజేపీలో చేరారు.

ఇక్కడే అసలు సమస్య వచ్చింది. బీజేపీలో చేరిన నేతలు ప్రజల్లో మంచి పట్టు ఉండటం, గతంలో తమతమ పార్టీల్లో కీలక భూమిక పోషించిన వారు కావటంతో బీజేపీలోసైతం తమదైన రీతిలో దూసుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికితోడు తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష పదవికోసం పార్టీలో ఆసక్తికర చర్చసాగుతున్నట్లు గుసుగుసలు వినిపిస్తున్నాయి.

డిసెంబర్‌ నాటికి జాతీయ అధ్యక్షుడి ఎన్నికపూర్తవుతుంది. తదనంతరం ఆయా రాష్ట్రాలకు నూతన రథసారథులను నియమించేందుకు బీజేపీ అధిష్టానం సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా తెలంగాణలోనూ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌ మార్పు ఖాయమనే చర్చ సాగుతుంది.

ఇదే సమయంలో పార్టీలో అధ్యక్షపదవికోసం ఎవరిపైరవీలు వారు చేసుకుంటున్నారని పార్టీలోని నేతలనుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత వర్సెస్‌ కొత్త బ్యాచ్‌ మధ్య వార్‌సైతం నడుస్తున్నట్లు తెలుస్తోంది. పాత నేతలు మాత్రం మరోసారి లక్ష్మణ్‌కే అధిష్టానం అవకాశం ఇస్తుందని అంటుండగా.. కొత్త నేతలు మాత్రం కొత్తగా పార్టీలోకి చేరిన సీనియర్‌ నేతలకే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని పేర్కొంటున్నాయి.

ఇప్పటికే బీజేపీ అధ్యక్ష రేసులో డికే అరుణ పేరు వినిపిస్తోంది. రాంమాధవ్‌ ద్వారా బీజేపీలో చేరిన డీకే అరుణ అమిత్‌షాతో పాటు ఢిల్లిలోని బీజేపీ పెద్దలకు రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారని పార్టీ వర్గాల్లో చర్చసాగుతుంది. ఇప్పటికే అధ్యక్ష పదవికి డీకే పేరును పాతవర్గంలోని కొందరు, కొత్త వర్గంలోని కొందరు సూచించినట్లు తెలుస్తోంది. దీనికితోడు డీకేకు పదవి ఇప్పించేందుకు ఢిల్లిలో కీలక నేతలు పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది.

చేరికలతో పార్టీ బలపడుతుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. కానీ పదవుల విషయం వచ్చేసరికి కొత్త నేతలు వర్సెస్‌ పాత నేతలుగా వార్‌ మారుతోంది. ఈ నేపథ్యంలో.. కేంద్ర పార్టీ అధిష్టానం లక్ష్మణ్‌కే మరోసారి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా.. పాత నాయకుల్లోనుంచి ఒకరిని ఎంపిక చేస్తారా.. కొత్తగా పార్టీలో చేరిన వారికే పెద్దపీట వేస్తారా.. అసలు అదిష్టానం మదిలో ఏముందో అనేది ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

అవినీతి తిమింగలం.. చెట్లకు నీరు పోసేవాడు కూడా బినామీనే..

అవినీతి తిమింగలం.. చెట్లకు నీరు పోసేవాడు కూడా బినామీనే..

   an hour ago


రెండుసార్లు శ్రీవారిని దర్శించుకున్న సీఎం.. ఆశ్చర్యపోతున్న భక్తులు

రెండుసార్లు శ్రీవారిని దర్శించుకున్న సీఎం.. ఆశ్చర్యపోతున్న భక్తులు

   4 hours ago


టెస్టింగ్, ట్రేసింగ్ ఇదేనా మంత్రం – కరోనా కట్టడిపై మోడీ సర్కార్ నిస్సహాయత

టెస్టింగ్, ట్రేసింగ్ ఇదేనా మంత్రం – కరోనా కట్టడిపై మోడీ సర్కార్ నిస్సహాయత

   4 hours ago


కర్ణాటక ఎమ్మెల్యేల జీతాల తగ్గింపు.. మరి మిగతా రాష్ట్రాల సంగతేమిటి?

కర్ణాటక ఎమ్మెల్యేల జీతాల తగ్గింపు.. మరి మిగతా రాష్ట్రాల సంగతేమిటి?

   5 hours ago


మోదీ-షాల‌కు కొడాలి కౌంట‌ర్‌...  ఇంత ధైర్యం ఎలా వ‌చ్చింద‌బ్బా?

మోదీ-షాల‌కు కొడాలి కౌంట‌ర్‌... ఇంత ధైర్యం ఎలా వ‌చ్చింద‌బ్బా?

   6 hours ago


వ్యవసాయ బిల్లులపై ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?

వ్యవసాయ బిల్లులపై ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?

   7 hours ago


పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన పీపుల్ స్టార్.!

పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన పీపుల్ స్టార్.!

   8 hours ago


ఇంటినుంచి పనే భేషుగ్గా ఉంది... హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు

ఇంటినుంచి పనే భేషుగ్గా ఉంది... హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు

   10 hours ago


ఏపీలో తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు

ఏపీలో తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు

   10 hours ago


ఇంటర్ సిలబస్ కుదింపు ఉంది.. లేదు.. తెలంగాణ బోర్డు గందరగోళం

ఇంటర్ సిలబస్ కుదింపు ఉంది.. లేదు.. తెలంగాణ బోర్డు గందరగోళం

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle