newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

బీజేపీలో తారా స్థాయికి చేరిన గ్రూపుల లొల్లి..!

05-11-201905-11-2019 09:57:24 IST
Updated On 05-11-2019 16:21:42 ISTUpdated On 05-11-20192019-11-05T04:27:24.602Z05-11-2019 2019-11-05T04:27:22.823Z - 2019-11-05T10:51:42.455Z - 05-11-2019

బీజేపీలో తారా స్థాయికి చేరిన గ్రూపుల లొల్లి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ ఒక‌వైపు, పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష మాజీ నేత యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ మ‌రోవైపు విడి విడిగా రాజకీయాలు న‌డుపుతున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌న్న విష‌యాన్ని వ‌రుస సంఘ‌ట‌న‌లు రుజువు చేస్తున్నాయి. రెండు గ్రూపులుగా విడిపోయిన నేత‌లు, కేడ‌ర్ ఎవ‌రికి వారే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించుకుంటున్నారు. ఆయ‌న కార్య‌క్ర‌మాల్లో ఈయ‌న పాల్గొన‌రు. ఈయ‌న చేప‌ట్టే కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన‌రు. ఇదే వారి వ్య‌వ‌హార శైలిలా కొన‌సాగుతోంది.

పార్టీ కార్య‌క్ర‌మ‌మైతే.. అదికూడా త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో అయితే అందులోను ఒకే కార్య‌క్ర‌మంలో ఉన్నా ఒకేచోట క‌నిపించ‌రు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌రువాత నుంచి మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు యెండ‌ల అర‌వింద్‌తో అంటీముట్ట‌న‌ట్టు ఉంటున్నారు.  అర‌వింద్ సీనియ‌ర్ నేత‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

ఇటీవ‌ల జ‌రిగిన స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నిజామాబాద్‌లో బీజేపీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్రీయ ఎక్తా దివ‌స్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఇందులో కూడా ఇద్ద‌రు నేత‌లు వేర్వేరుగా పాల్గొన్నారు. ర‌న్‌ఫ‌ర్ యూనిటీలో ఎంపీ అర‌వింద్ అనుచ‌రులు పాల్గొన‌గా ప్ర‌తిజ్ఞ చేసే స‌మ‌యంలో మాత్ర‌మే యెండ‌ల ల‌క్ష్మీ నారాయ‌ణ హాజ‌ర‌య్యారు.

గాంధీ సంక‌ల్ప యాత్ర‌లో కూడా ఇరు నాయ‌కులు బృందాలుగా విడిపోయి ఎవ‌రికివారే ర్యాలీలు నిర్వ‌హించుకున్నారు. ఎంపీ అర‌వింద్‌తో జిల్లా అధ్యక్షుడు ప‌ల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు ధ‌న్‌పాల్ సూర్య‌నారాయ‌ణగుప్తా, బ‌స్వా ల‌క్ష్మీన‌ర‌స‌య్యలు ప్ర‌ధానంగా వారి అనుచ‌రులు కూడా ఉన్నారు.

ఇటు యెండ‌ల ల‌క్ష్మీ నారాయ‌ణ‌తో న‌గ‌ర నాయ‌కులు రోష‌న్ లాల్ బొహ్రా, ప‌టేల్, ఆనంద్ త‌దిత‌రులు ఉన్నారు. పూలంగ్ చౌరస్తాలోని అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లువేసే స‌మ‌యంలో మాత్రం ఇరువురు ఒకేవేదిక పంచుకున్నారు. అదికూడా ఎడ‌మొహం.. పెడ‌మొహంగానే.

అదే రోజు సాయంత్రం పార్టీ కార్యాల‌యంలో ప్రెస్‌మీట్ పెట్టారు. అస‌లు యెండ‌ల పార్టీ కార్య‌క్ర‌మంలో జ‌రిగే ఏ ప్రెస్‌మీట్‌కూ హాజ‌రు కావ‌డం లేదు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌న్న విష‌యాన్ని ఆ పార్టీ నాయ‌కులే చెప్పుకుంటున్నారు. మొత్తం మీద నిజామాబాద్ బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్నాయి. 

 

 

 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   7 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   7 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   10 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   10 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   11 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   12 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   14 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   15 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   16 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   17 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle