బీజేపీతో పాటే ఆర్ఎస్ఎస్లోనూ చేరికలు..!
27-12-201927-12-2019 12:41:04 IST
2019-12-27T07:11:04.595Z27-12-2019 2019-12-27T07:11:00.429Z - - 15-04-2021

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అంటే భారతీయ జనతా పార్టీకి మాతృసంస్థ లాంటిది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా, ఎన్ని రాష్ట్రాల్లో పాగా వేసినా ఆ పార్టీ నడిచేది ఆర్ఎస్ఎస్ బాటలోనే అనేది బహిరంగ సత్యమే. అందుకే అధికార కేంద్రం ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు మాత్రం నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి తరచూ వెళుతుంటారు. ఇప్పుడు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు అందరూ గతంలో ఆర్ఎస్ఎస్లో పని చేసి వచ్చిన వారే. ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో వారంతా పాల్గొంటుంటారు. ఆర్ఎస్ఎస్పై ఎన్ని ఆరోపణలు ఉన్నా, హిందుత్వ ఎజెండాతో పని చేస్తుందనే విమర్శలు ఉన్నా దేశం పట్ల ఆ సంస్థ నిబద్ధతతో ఉంటుందనే పేరు ఉంది. దేశవ్యాప్తంగా ఇంచుమించు ఇన్ని గ్రామాలకు అర్ఎస్ఎస్ విస్తరించి ఉంది. బీజేపీ ఈ స్థాయికి ఎదగడంలో, ఆ పార్టీ విజయాల్లో ఆర్ఎస్ఎస్దే కీలక పాత్ర. అందుకే ఆర్ఎస్ఎస్ పెద్దలు చెప్పినట్లే బీజేపీ నడుచుకుంటుందని, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే బీజేపీలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారనేది కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముందు నుంచీ ఆర్ఎస్ఎస్, బీజేపీలో పని చేస్తున్న వారికి ఈ విషయం బాగా తెలుసు. కొందరు నేతలకైతే కర్ర పట్టుకొని ఆర్ఎస్ఎస్ కవాతు చేయడం ఎంతో ఇష్టం. అందుకే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, రాజాసింగ్ వంటి వారు ఏ హోదాల్లో ఉన్నా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. కవాతుల్లో పాల్గొంటారు. వీరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడంలో పెద్ద వింతేమీ లేదు కానీ ఇటీవల బీజేపీలో చేరిన నేతలే ఆర్ఎస్ఎస్ కవాతుల్లో పాల్గొనడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్ వేదికగా ఆర్ఎస్ఎస్ సార్వజనికోత్సవం పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయంసేవకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీ కవాతు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ ఛాలక్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్కు చెందిన కేవలం నలుగురు మాత్రమే వేదికపైకి ఎక్కడా, కిషన్ రెడ్డి సహా బీజేపీ ప్రముఖులంతా కిందే కూర్చున్నారు. ఇక, ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్తో ఏ మాత్రం సంబంధం లేని, ఇటీవల వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు హాజరుకావడం, అదీ ఆర్ఎస్ఎస్ డ్రెస్లలో కర్రె పట్టుకొని రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించింది. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆర్ఎస్ఎస్ డ్రెస్లో వచ్చారు. ఆయనది పక్కా కాంగ్రెస్ కుటుంబ నేపథ్యం. మరో ఎంపీ సోయం బాపూరావు కూడా టీఆర్ఎస్ నుంచి ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన కూడా మొదటిసారి ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీలో సుదీర్ఘకాలం పని చేసిన గరికపాటి మోహన్రావు, ఇనగాల పెద్దిరెడ్డికి ఆర్ఎస్ఎస్తో ఏ మాత్రం సంబంధం లేదు. కానీ, వారు కూడా ఆర్ఎస్ఎస్ డ్రెస్లో కవాతులో పాల్గొన్నారు. దళిత వర్గానికి చెందిన నేతలు, సుదీర్ఘకాలం కాంగ్రెస్, టీఆర్ఎస్లో పనిచేసి ఇటీవలే బీజేపీలో చేరిన గుండె విజయరామారావు, వివేక్ వెంకటస్వామి కూడా ఆర్ఎస్ఎస్ డ్రెస్ వేసుకొని కవాతులో పాల్గొన్నారు. ఇలా ఆర్ఎస్ఎస్తో ఏం సంబంధం లేకున్నా, సెక్యులర్ పార్టీల్లో సుదీర్ఘకాలం పని చేసిన నేతలు సైతం బీజేపీలో చేరగానే ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా మారిపోయి కర్రలు పట్టుకొని కవాతు చేశారు. అంటే, బీజేపీలో ఎదగాలంటే ఆర్ఎస్ఎస్లో ఉండాలని వారు గుర్తించినట్లున్నారు అనే టాక్ వినిపిస్తోంది.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
13 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
13 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
13 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
17 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
18 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
17 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
19 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
20 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
15 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
21 hours ago
ఇంకా