newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బీజేపీతో అమితుమీకే కేసీఆర్ ఫిక్స్?

27-12-201927-12-2019 14:27:07 IST
Updated On 28-12-2019 11:54:33 ISTUpdated On 28-12-20192019-12-27T08:57:07.183Z27-12-2019 2019-12-27T08:56:36.966Z - 2019-12-28T06:24:33.816Z - 28-12-2019

బీజేపీతో అమితుమీకే కేసీఆర్ ఫిక్స్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం కెసిఆర్ బీజేపీతో అమీతుమీ తేల్చుకుంనేందుకే సిద్ధపడ్డారని రాజకీయవర్గాలలో వినిపిస్తున్న మాట. ఆ మాటకొస్తే తెలంగాణ ప్రస్తుత రాజకీయాలను దగ్గర చూస్తే ఈ మాట అవుననే అనిపించక మానదు. నిజానికి తెలంగాణలో గతేడాది ముందస్తు ఎన్నికల సమయంలో కేంద్రంతో తెరాసకు మంచి టర్మ్స్ కలిగి ఉన్నారు. ఈ ఏడాది సాధారణ ఎన్నికలకు ముందు కూడా కేంద్ర-రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలే కలిగి ఉంది.

కానీ సాధారణ ఎన్నికల అనంతరం కేంద్రంతో కేసీఆర్ అండ్ కోతో వైరం మొదలైంది. తెలంగాణలో బీజేపీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం ఒక కారణమైతే తెలంగాణలో బలపడే సన్నాహాలలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం మీద దూకుడు పెంచినట్లుగా కనిపించడం కూడా ఈ రాజకీయ వైరానికి కారణంగా కనిపిస్తుంది. తాజాగా కేంద్రం పౌరసత్వ చట్టంపై తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, సీఏఎ బిల్లును తెరాస వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

దీనిపై రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ తెరాస నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇదిలా ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం నిజామాబాద్ లో తలపెట్టిన సభకు అనుమతినివ్వడం మరింత చర్చకు దారితీస్తుంది. ఎంపీ అసదుద్దీన్ కేంద్ర పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ సభను నిర్వహిస్తున్న కారణంగానే సభకు అనుమతి ఇచ్చారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే కేంద్ర బిల్లుకు అనుకూలంగా తాము సభ నిర్వహిస్తామని.. అందుకు కూడా అనుమతి ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండగా కాంగ్రెస్ ఇప్పటికే సభలకు అనుమతులు అధికారికంగా కోరారు. కానీ తెరాస ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు మాత్రం అనుమతులను నిరాకరిస్తున్నారు. కేవలం ఒక్క ఎంఐఎం పార్టీకి అనుమతులు ఇవ్వడం లౌకిక వాదం ఎలా అవుతుందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

కాగా నిజామాబాద్ లో ఎంఐఎం సభ వెనుక ఓ రాజకీయ కారణం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ ఎన్నికలలో నిజామాబాద్ లో ఎంపీగా పోటీచేసిన సీఎం కెసిఆర్ కుమార్తె కవిత ఓడిపోగా బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ గెలిచారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కనుక అక్కడ బీజేపీ అనుకూల సమీకరణాలను దెబ్బతీసేందుకే అక్కడ సభ ఏర్పాటు చేసినట్లు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీ కాగా నిజామాబాద్ తో ఎలాంటి సంబంధం లేదు. అక్కడ కేంద్రం బిల్లుతో సంబంధం ఉండే తెరాస-ఎంఐఎం పార్టీ ఎంపీ కూడా లేరు. కానీ అక్కడ ఎంఐఎం సభ పెట్టడం.. అందుకు ప్రభుత్వం, పోలీస్ అనుమతులు ఇవ్వడం పొలిటికల్ యాక్షన్ ప్లాన్ గానే కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రకారంగా చూస్తే సీఎం కెసిఆర్ ఎంఐఎంను అడ్డం పెట్టుకొని బీజేపీతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడినట్లుగా భావిస్తున్నారు.

 

 

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   13 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   15 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   21 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   19 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle